భారతదేశానికి కాలసర్ప దోషం : కరోనా కట్టడికి శ్రీ శారదా పీఠంలో యాగం

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 06:20 AM IST
భారతదేశానికి కాలసర్ప దోషం : కరోనా కట్టడికి శ్రీ శారదా పీఠంలో యాగం

Updated On : March 18, 2020 / 6:20 AM IST

ఏప్రిల్ 02వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు..భారతదేశానికి కాలసర్ప దోషం ఉందని స్వాత్మానేంద్ర సరస్వతి 10tvకి వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో… దేశ రక్షణ కోసం, ప్రపంచంలో ఉండే మానవాళికి శుభం కలగాలని యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2020, మార్చి 18వ తేదీ బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠంలో విష జ్వర పీడా హర యాగం నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్‌ని అరికట్టేందుకు విశాఖలోని శ్రీ శారదా పీఠం నడుం బిగించింది. అందులో భాగంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఉత్తారధికారి స్వాత్మానందేంద్ర పర్యవేక్షణలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 10tvతో స్వాత్మానేంద్ర సరస్వతి మాట్లాడారు. మొత్తం 11 రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తారు. యాగంలో ఎన్నో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తున్నట్లు, దేశ ప్రజల రక్షణ,  సకలమానవాళికి శుభం కలుగాలని యాగం చేపడుతున్నట్లు వెల్లడించారు. 

సామాజిక సృహతో కూడుకున్న పీఠమని, యాగంతో పాటు అనేక పాశుపదాలతో యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనేక మంది వేద పండితులు పాల్గొంటున్నట్లు, గ్రహ సంచార పరిస్థితిని చూస్తే…ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్రం, దేశంపై కొన్ని ప్రభావం చూపిస్తాయన్నారు. యాగంలో 11 మంది వేద పండితులు, అనేక మంత్రాలు జపం చేసేందుకు రుత్వికులు పాల్గొంటారన్నారు. మొత్తంగా 26 మంది యాగంలో పాల్గొంటారని వెల్లడించారు. వేదం యొక్క శక్తి అపారమని, అందువల్లే దేశం సరియైన క్రమంలో నడుస్తోందన్నారు. 

Read More : చికెట్ తింటే కరోనా వస్తుందా ? నిరూపించండి..రూ. కోటి ఇస్తాం