ఏపీలో మరో రెండు: 365కి చేరిన కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : April 10, 2020 / 05:55 AM IST
ఏపీలో మరో రెండు: 365కి చేరిన కరోనా కేసులు

Updated On : April 10, 2020 / 5:55 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కంగారు పెట్టేస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న, కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి దెబ్బకు ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రలో బాధితుల సంఖ్య  365కి చేరుకుంది. 

రాష్ట్రంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి.. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో.. మరో రెండు పాజిటివ్ కేసులు అనంతపురం జిల్లాలో నమోదవగా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పదిమందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.

రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్‌లో కరోనా విషయంలో టాప్‌లో ఉండగా.. 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు  ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. 

జిల్లాలవారీగా నమోదైన కేసులు:
కర్నూలు జిల్లా – 75
గుంటూరు జిల్లా – 51
నెల్లూరు జిల్లా – 48
ప్రకాశం జిల్లా – 38
కృష్ణా జిల్లా -35
కడప జిల్లా – 29
పశ్చిమ గోదావరి జిల్లా – 22
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా – 20
తూర్పుగోదావరి జిల్లా – 12
అనంతపురం జిల్లా -15
మొత్తం కేసులు – 365

Also Read |  బయటపడ్డ చైనా సీక్రెట్… : పదేళ్ల డేటా దొంగిలించిన హ్యాకర్లు