Yemmiganur: వరి పొలంలో భారీ మొసలి.. చూడడానికి భారీగా తరలివచ్చిన ప్రజలు

Yemmiganur: వరి కోత మిషన్ తగిలి మొసలి కాలికి గాయమైంది. మొసలి ఉన్న సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు రైతులు తెలిపారు.

Yemmiganur: వరి పొలంలో భారీ మొసలి.. చూడడానికి భారీగా తరలివచ్చిన ప్రజలు

Crocodile

Yemmiganur: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool district) ఎమ్మిగనూరు (Yemmiganur) మండలంలో మొసలి కలకలం రేపింది. చెన్నాపురంలోని వరి పొలంలో మొసలి కనపడడంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. పొలంలో వరి కోత కోస్తుండగా ఓ రైతు మొసలిని గుర్తించారు.

వరి కోత మిషన్ తగిలి మొసలి కాలికి గాయమైంది. మొసలి ఉన్న సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు రైతులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వరి పొలం దగ్గరకు చేరుకుని చరయలు తీసుకున్నారు. ఎల్ఎల్సీ కాలువలో నీళ్లు తగ్గడంతో మొసలి పొలంలోకి వచ్చినట్లు గుర్తించారు.

మొసలి భారీ పరిమాణంలో ఉండడంతో దాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల వారూ వస్తున్నారు. మొసలి సుమారు రెండు మీటర్లు ఉంది. అది 50-60 కిలోల బరువు ఉంటుందని అంచనా వేశారు. మొసలి కాలిని గాయమైన కారణంగా దానికి మొదట అధికారులు చికిత్స అందేలా చేశారు.

Toothache : ఈ అద్భుతమైన ఆకు సహాయంతో పంటి నొప్పిని పొగొట్టుకోండి !