Cyclone Montha: ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. ఈ నెల 30 వరకు తెలంగాణలోనూ కుమ్మేయనున్న వానలు.. ఈ జిల్లాల్లోనైతే..

రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 22 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

Cyclone Montha: ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. ఈ నెల 30 వరకు తెలంగాణలోనూ కుమ్మేయనున్న వానలు.. ఈ జిల్లాల్లోనైతే..

Updated On : October 25, 2025 / 3:52 PM IST

Cyclone Montha: తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేటి నుంచి ఈ నెల 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రం భీమ్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కాగా, ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం క్రమంగా తుపానుగా బలపడుతోంది. నాలుగు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.

Also Read: బంగారం ధరలపై కళ్లు బైర్లు కమ్మే విషయాన్ని చెప్పిన బాబా వాంగ.. పసిడి కొంటున్నారా ఏంటి?

ఈ నెల 26న  
ఎల్లో అలర్ట్: పొట్టి శ్రీరాములు, తిరుపతి

27న
రెడ్ అలర్ట్: బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్ కడప, అనంతపురం, తిరుపతి
ఆరెంజ్ అలర్ట్: కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు
ఎల్లో అలర్ట్: అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్

28న
రెడ్ అలర్ట్: కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప
ఆరెంజ్ అలర్ట్ : విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి జిల్లా నెల్లూరు తిరుపతి నంద్యాల
ఎల్లో అలర్ట్: శ్రీకాకుళం, పార్వతిపురం, మన్యం, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు

ఎంత వర్షపాతం నమోదవుతుంది?

  • రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. 22 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం
  • ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో అతి భారీ వర్షాలు.. 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసే అవకాశం
  • ఎల్లో అలర్ట్ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఏడు నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్య అవకాశం