Vizianagaram Train Accident : రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే..

మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. Vizianagaram Train Accident

Vizianagaram Train Accident : రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే..

Vizianagaram Train Accident Update

Updated On : October 30, 2023 / 8:46 AM IST

Vizianagaram Train Accident Death Toll : విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొత్త వలస మండలం కంటకాపల్లి దగ్గర రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. 30మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

రైలు ప్రమాద ఘటనా స్థలికి అదనపు రైల్వే సిబ్బందిని తరలించారు. విశాఖ నుంచి మంచి నీళ్లు, ఆహారంతో వాహనాలు పంపించారు. రైలు ప్రమాద బాధితుల వైద్య సేవల కోసం విజయనగరంలోని మహారాజా ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సాధారణ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారిని విశాఖలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.

Also Read : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు

విజయనగరం జిల్లాలో ఆదివారం (అక్టోబర్ 29) రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ రాయగడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస-విశాఖ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొట్టింది. దీంతో పలాస ప్యాసింజర్‌ కు సంబంధించి 5 బోగీలు పట్టాలు తప్పాయి.

Also Read : ఘోర రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా..
రైలు దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50వేల చొప్పున సాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.