Bus Accident : జల్లేరు వాగు బస్సు ప్రమాద ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య

అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది.

Bus Accident : జల్లేరు వాగు బస్సు ప్రమాద ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య

Bus Deaths

Updated On : December 15, 2021 / 5:58 PM IST

bus accident in west godavari : పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు పడటంతో డ్రైవర్ సహా పది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను జగన్ ఆదేశించారు.

Bus Accident : జల్లేరు వాగు నుంచి బస్సు వెలికితీత

బస్సు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బస్సు బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది. ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. జల్లేరువాగులో పడిన బస్సును అధికారులు బయటికి తీశారు. క్రేన్ల సాయంతో బస్సును బయటికి లాగారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి బస్సును బయటికి తీశారు.

బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. కాగా బస్సు వేలేరుపాడులో నైట్ హాల్ట్ ఉన్నది. ఉదయం భద్రాచలం వెళ్లి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తోంది. జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.

AP High Court : తిరుపతిలో అమరావతి రైతుల సభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ప్రమాదానికి గురైన బస్సు కొత్తదని..ఎలాంటి సమస్యలు లేవని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. గత వారం రోజులుగా ఎలాంటి సమస్యలు లేవని..రాలేదని చెప్పారు. బస్సులో టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఏపీ 37జెడ్ 193 నెంబర్ గల బస్సు లేటెస్టు వెహికిల్ అని పేర్కొన్నారు.

ఈ బస్సు 3లక్షల 11 కి.మీ మాత్రమే తిరిగిందని తెలిపారు. ఇది కొత్త బస్సు కిందే లెక్క అన్నారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. డ్రైవర్ చిన్నారావు రోడ్డును సరిగా ఎస్టిమేట్ చేయలేకపోయాడని పేర్కొన్నారు.