సచివాలయానికి తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రాజధాని రైతులు సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే.

సచివాలయానికి తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రాజధాని రైతులు సిద్ధం..

AP Deputy CM Pawan Kalyan

Minister Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలనను ఉరుకులు పెట్టిస్తున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్ కల్యాణ్ తో సహా మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్, పలువురు మంత్రులు మినహా మిగిలిన వారు సచివాలయంలోని వారికి కేటాయించిన చాంబర్లలో వారికి కేటాయించిన శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి తమతమ శాఖల్లో పాలనను షురూ చేశారు.

Also Read : పక్కపక్కనే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ చాంబర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. రేపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇవాళ సచివాలయానికి పవన్ కల్యాణ్ రానున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్ రాబోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి పవన్ చేరుకుంటారు. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తారు.

Also Read : పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ ను పరిశీలించిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.