పక్కపక్కనే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ చాంబర్లు

Pawan Kalyan: ఈ నెల 19న తన చాంబర్‌లో మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

పక్కపక్కనే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ చాంబర్లు

Pawan Kalyan Chamber: అమరావతిలోని సెక్రటేరియట్లో 2వ బ్లాక్‌లో జనసేన మంత్రులకు చాంబర్లను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్‌ను అధికారులు సిద్ధం చేశారు.

ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల చాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కగా పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ చాంబర్లు ఉంటాయి.

ఈ నెల 19న తన చాంబర్‌లో మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి.

ఇప్పటికే మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. పవన్ కు పంచాయతీ రాజ్‌ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు.

Also Read: పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు