Pawan Kalyan : శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో రిలీజ్.. అధికారులకు కీలక ఆదేశాలు..

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ ఆ వీడియోను విడుదల చేశారు.

Pawan Kalyan : శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో రిలీజ్.. అధికారులకు కీలక ఆదేశాలు..

AP Deputy CM Pawan Kalyan

Updated On : November 13, 2025 / 2:02 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. శేషాచలం అడవుల్లో కబ్జా సామ్రాజ్యం అంటూ ఆ వీడియోను విడుదల చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ శేషాచలం అడవుల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంగళంపేట అడవుల్లో మాజీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురైనట్లు పవన్ పేర్కొన్నారు. కబ్జాకు గురైన భూములను స్వయంగా వీడియో తీశారు. ఆ వీడియోను ప్రస్తుతం రిలీజ్ చేశారు.

ఈ భూముల వ్యవహారం పై అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అడవి మధ్యలో వారసత్వంగా అన్ని ఎకరాల భూమి ఎలా వచ్చిందంటూ పవన్ ప్రశ్నించారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్‌లో పొందుపర్చాలని పవన్ అధికారులను ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత భూమి ఉంది.. వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకి తెలియాలని అన్నారు. అటవీ ఆస్తులను కబ్జాచేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశించారు. ఎంతటి వారికైనా మినహాయింపులు లేకుండా అటవీ భూమిని ఆక్రమించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ నివేదికలు, న్యాయ నిపుణుల మార్గదర్శకత్వం ఆధారంగా చర్య తీసుకోవాలని పవన్ అధికారులకు సూచించారు.

అవకతవకలను నిరోధించడానికి, పారదర్శకతను నిర్ధారించడానికి అన్ని భూమి రికార్డులను డిజిటలైజ్ చేయాలి.. అటవీ భూములు జాతీయ ఆస్తులు. వాటిని ఆక్రమించేవారు, వాటిని దుర్వినియోగం చేసేవారు లేదా అటవీ చట్టాలను ఉల్లంఘించేవారు ఎవరైనా సరే చర్యలు ఉంటాయి. రక్షిత అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల ఉండే ప్రాంతాలను ఆక్రమించడాన్ని ప్రభుత్వం సహించదని పవన్ స్పష్టం చేశారు.