Pawan Kalyan : మరో 15 ఏళ్లు ఏపీలో కూటమి సర్కారే ఉంటుంది- పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్ కే ఓటేయాలని కోరారు.

Pawan Kalyan
Pawan Kalyan : మరో 15 ఏళ్లు ఏపీలో కూటమి సర్కారే అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేసిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే వెయ్యికి పైగా కోట్లతో పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్.. వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్ కే ఓటేయాలని కోరారు.
Also Read : ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరికొంతమంది నేతలు క్యూ లైన్లో ఉన్నారా?
”కూటమి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్లు ఐదేళ్ల కాలంలో కేవలం 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఇప్పటికి వెయ్యి 5వేల కోట్లు పనులు మంజూరు చేశాం. వెయ్యి 69 కిలోమీటర్లు. ఏడాది కూడా కాలేదు. నేను పదే పదే చెబుతున్నా. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
కేంద్రంలో బీజేపీని లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప, విభజన సమయం నుంచి గత పాలన వరకు నలిగిపోయాం, అందులోంచి బయటపడాలంటే మాకు ఒక 15 సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి. ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు సరి చేస్తున్నారు. మీ కోసం మేము పని చేస్తాం. మీ ఆశీస్సులు మాకు కావాలి.
నా కోరిక ఒకటే. వచ్చే ఎన్నికలకు మన్యం మొత్తం కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఐదేళ్ల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు. కానీ వారు విలువ ఇవ్వలేదు. మీరు ఓటు వేయకపోయినా మేము మీ ఓటుకు విలువిచ్చి ఇక్కడికి వచ్చాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.