ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరికొంతమంది నేతలు క్యూ లైన్లో ఉన్నారా?

ఈ సస్పెన్షన్ వెనకున్నది ఎవరు..? ఆమెను పార్టీ అధిష్టానానికి దూరం చేసిందెవరు?

ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరికొంతమంది నేతలు క్యూ లైన్లో ఉన్నారా?

Updated On : April 7, 2025 / 8:42 PM IST

వైసీపీలో విభేదాలు, గ్రూపు రాజకీయాలు మరింత ముదురుతున్నాయా? ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మరికొంతమంది నేతలు క్యూ లైన్లో ఉన్నారా? ఇటీవల ఏలూరులో జరిగిన పరిణామాలను చూస్తే అది నిజమేనన్న వాదన తెరపైకి వస్తోందట.

అంతేకాదు ఏలూరు వైసిపిలో కీలక నేతలపై చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనంతటికీ కారణం కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆ నేతేనా? లేక ఆ మాజీ మంత్రివర్యులు కమింగ్ బ్యాక్ అంటూ రాజకీయాలు చేయడమే అందుకు కారణమా..? ఇంతకీ ఏలూరు వైసీపీలో ఏం జరుగుతోంది..?

ఏపీలో ఓటమి తర్వాత వైసీపీలో గ్రూపు రాజకీయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయంట. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని వీడి కూటమిలోకి చేరడంతో..అదే బాటలో మరికొంత మంది పయనించేందుకు రెడీగా ఉన్నారంట. తాజాగా ఏలూరు జంపింగ్ పాలిటిక్స్ తెరమీదకు వచ్చాయి.. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇక్కడే అసలు సమస్య?
అయితే ఆయన కంటే ముందే మేయర్ కార్పొరేటర్లు ఇంకా ఎందరో కీలక నేతలు పార్టీని వీడడడంతో జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం ఆందోళన చెందకుండా గతంలో ఆళ్ళనానికి కీలక అనుచరుడుగా ఉన్న మామిళ్ళపల్లి జయప్రకాష్ అలియాస్ జేపీకి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను కట్టబెట్టింది. జేపీ కూడా ఏలూరులో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా జేపీ..ఆళ్ళ నాని అనుచరుడు కావడంతో ఇక్కడే అసలు సమస్య మొదలైందట. ఆళ్లనానికి సన్నిహితంగా ఉంది ఎవరు..? తమకు అడ్డుగా ఉన్నవాళ్లు ఎవరు? పార్టీకి అవసరంలేని వారు ఎవరు అంటూ ఒక్కొక్కరిని పార్టీకి దూరం చేస్తున్నారంట వైసీపీలో ఉన్న కొందరు నేతలు. అసలే అధికారం లేక తీవ్ర నిరాశలో ఉన్న క్యాడర్ ఇప్పుడు కొత్త నేతల రాకతో మరింత కుంగిపోతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట.

Also Read: నటి హేమ ఇందుకే నాకు నోటీసులు పంపింది.. నేను ఇక ఎక్కడా తగ్గేదే లేదు: కరాటే కల్యాణి

వైసీపీలో ఈ గ్రూపు రాజకీయాలతో కీలక మహిళ నేత, మాజీ సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి కూడా తీవ్ర సంతృప్తిలో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీలో ఆళ్ళ నానితో పాటే ఉంటూ ఆ తర్వాత వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యాదవ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని ఇటీవల వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.

అయితే ఈ సస్పెన్షన్ వెనకున్నది ఎవరు..? ఆమెను పార్టీ అధిష్టానానికి దూరం చేసిందెవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఏలూరులో పొలిటికల్ చర్చకు దారితీశాయట. ఆమెను పార్టీకి దూరం చేయడానికి కారణం గ్రూపు రాజకీయాలేననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొత్త నియోజకవర్గ ఇంచార్జిగా జేపీకి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై కావాలని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని..తనను పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు చేశారని కార్యకర్తల దగ్గర శ్రీలక్షి ఆవేదన వెల్లగక్కారట.. పార్టీలో తనకు కీలక పదవి వచ్చే సమయంలోనే ఇవన్నీ జరిగాయని.. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే సస్పెండ్ చేయడమేంటని శ్రీలక్ష్మి కొంత ఆగ్రహంగా ఉన్నారంట. ఇదిలా ఉంటే శ్రీలక్ష్మిపై యాక్షన్‌ ఎపిసోడ్ వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నారనే చర్చ కూడా లోకల్‌గా నడుస్తోంది.

ప్రణాళికల్లో భాగంగానే శ్రీలక్ష్మిని పార్టీకి దూరం చేశారా?
మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు.. తణుకు అసెంబ్లీ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పి తిరిగి ఏలూరు వచ్చేందుకు వేసుకుంటున్న ప్రణాళికల్లో భాగంగానే ఆయన సామాజిక వర్గానికి చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని పార్టీకి దూరం చేశారని ఓ వర్గం గట్టిగా నమ్ముతుందట.

ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వీరిద్దరూ పనిచేసిన సందర్భాలు ఉండడం..అప్పుడు ఏం జరిగిందో గాని ఇప్పుడు మాత్రం వారి వల్ల వైసీపీకి నష్టం చేకూరే ప్రమాదం తలెత్తిందన్న చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ హయాంలో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా కారుమూరి నాగేశ్వరరావు పనిచేయడం, ఆ తర్వాత పక్కనే ఉన్న దెందులూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు.

మరోవైపు నరసాపురం పార్లమెంట్లో తణుకు అసెంబ్లీ నుంచి కూడా ఆయన పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించడం…దాంతో జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో కారుమూరి నాగేశ్వరావు మరోసారి పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణపై ఓడిపోవడంతో ఇక తణుకులో తన భవిష్యత్తు కష్టమని, ఏలూరుకు తిరిగి వచ్చేందుకు కారుమూరి నాగేశ్వరరావు ప్లాన్ వేసుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగానే పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని పార్టీకి దూరం చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు..ఇటీవల మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత కొంతమంది ముఖ్య నేతలతో సమావేశం కావడంపై ఈ అనుమానాలన్నీ నిజమేనని భావించాల్సి వస్తుందట. ఏది ఏమైనప్పటికీ..అధికారం కోల్పోయిన వైసీపీని ఒక్కొక్కరు వీడిపోతున్న ఇలాంటి సమయంలో శ్రీలక్ష్మి పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందంట.