మరోసారి కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అంజన్నను దర్శించుకోవడం ద్వారా తనకు మంచి జరుగుతుందని పవన్ గట్టిగా విశ్వసిస్తారు.

మరోసారి కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 29న కొండగట్టుకు వెళ్లనున్నారు. గతంలో కొండగట్టు అంజన్నను దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్.. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంతో మరోసారి ఆలయానికి వెళ్లనున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్.. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. 2023 జనవరి 20న వారాహి వాహన పూజతో పాటు కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కల్యాణ్ ఇలవేల్పుగా భావించి పూజిస్తున్నారు. అత్యంత ఆరాధ్య దైవంగా కొండగట్టు అంజన్నను పూజిస్తారు పవన్.

గతంలో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధినేతగా ఉన్న సమయంలోనూ పవన్ కల్యాణ్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి బయటపడటానికి, తన ప్రాణం కాపాడేందుకు కొండగట్టు ఆంజనేయస్వామి కారణం అని చెప్పి దర్శనం చేసుకున్నారు పవన్ కల్యాణ్. రాజకీయంగా ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముందు కూడా పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అంజన్నను దర్శించుకోవడం ద్వారా తనకు మంచి జరుగుతుందని పవన్ గట్టిగా విశ్వసిస్తారు.

ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్.. ఏపీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలు గెలిచారు, అధికారంలో పాలుపంచుకున్నారు దాంతో మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలని పవన్ నిర్ణయించారు. పవన్ కల్యాణ్ రాక నేపథ్యంలో భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పవన్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు.. పవన్ కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : త్వరలోనే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం?- ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు