Pawan Kalyan : తిరుపతికి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
Pawan Kalyan : తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన బాధితులను పవన్ పరామర్శించనున్నారు.

Deputy CM Pawan Kalyan Tirupati
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి బయల్దేరారు. గురువారం (జనవరి 9) ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయంకు పవన్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లనున్నారు.
Read Also : TTD Stampede : తిరుమల ఘటనపై స్పందించిన మోహన్‌బాబు..
తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను పవన్ పరామర్శించనున్నారు. తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పవన్ పరామర్శించనున్నారు.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బాధితులకు అండగా నిలబడి వారి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. తిరుపతి దుర్ఘటనను పవన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు పవన్ తన ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని తిరుపతి పర్యటనకు బయల్దేరినట్టు పార్టీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
తిరుపతిలో బాధితులను పరామర్శ అనంతరం తిరుమల వేంకటేశ్వర స్వామిని పవన్ దర్శించుకోనున్నట్లు సమాచారం. తిరుమల దేవస్థానం అధికారులు, జిల్లా అధికారులతో కూడా పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి భక్తుల భద్రత చర్యలపై పవన్ చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు సూచనలు చేయనున్నారు.
Read Also : Tirupati Stampede: తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం