మాటల తూటాలు : 151 మంది ఎమ్మెల్యేలున్న ధైర్యం లేదు

  • Published By: madhu ,Published On : November 16, 2019 / 09:27 AM IST
మాటల తూటాలు : 151 మంది ఎమ్మెల్యేలున్న ధైర్యం లేదు

Updated On : November 16, 2019 / 9:27 AM IST

సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష ఉద్యమంతో జగన్ కుర్చీ కదులుతోందని విమర్శించారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని విమర్శించారు. రావాలి జగన్, కావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ రావాలి సీబీఐ కోర్టు అంటోదని విమర్శించారు.

విమర్శలు చేసేందుకు 151 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం సరిపోవడం లేదా? అని సూటిగా దేవినేని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ధైర్యం సరిపోకనే తమ నేతలను భయపెట్టి, లొంగదీసుకుని వారితో తిట్టిస్తున్నారంటూ విమర్శించారు. 

ఇటీవలే ఇసుక కొరతపై బాబు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి. దీనిపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కౌంటర్ ఇస్తున్నారు. వంశీ చేసిన ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు.