DISHA APPకు జబర్దస్త్ రెస్పాండ్ : 3 రోజులు..35 వేల మంది డౌన్ లోడ్

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 11:32 PM IST
DISHA APPకు జబర్దస్త్ రెస్పాండ్ : 3 రోజులు..35 వేల మంది డౌన్ లోడ్

Updated On : February 12, 2020 / 11:32 PM IST

ఏపీ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన దిశ యాప్‌కు సూపర్ రెస్పాండ్ లభిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. ప్రతి రోజుకు 2 వేల మంది టెస్ట్ కాల్స్ చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా దిశ యాప్‌ను రూపొందించారు. 2020, ఫిబ్రవరి 8వ తేదీన రాజమండ్రిలో సీఎం జగన్ దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

ఫిబ్రవరి 09వ తేదీ నుంచి ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్, IOSలలో అందుబాటులోకి వచ్చింది. యాప్ సేవలకు మెచ్చి గూగుల్ ప్లే స్టోర్‌లలో 5కి ఏకంగా 4.8 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. 
 

దిశ యాప్ పనిచేస్తుందిలా :-

* ప్లే స్టోర్‌లోకి వెళ్లి..దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
* యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం ఇంటర్నెట్ ఉన్నా..లేకున్నా వర్క్ చేస్తుంది. 
* ఆపదలో  ఉన్న వారు SOS బటన్ నొక్కాలి. వారి ఫోన్ నెంబర్, చిరునామా, వారున్న ప్రదేశం దిశ కంట్రోల్‌ రూంకు చేరుకుంటాయి. 

* బటన్ ప్రెస్ చేసే సమయంలో చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూ..ఇటూ ఊపాల్సి ఉంటుంది. 
* SOS బటన్ నొక్కితే వాయిస్‌తో పాటు..పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూంకు పంపించే అవకాశం ఉంది. 
* కంట్రోల్‌రూంకు సమాచారం అందగానే..అక్కడి నుంచి సమీపంలోని పీఎస్‌‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమెటిక్‌గా కాల్ వెళుతుంది. 

* ప్రమాదంలో ఉన్న వారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీసు రక్షక్ వాహనాల్లోని మొబైల్ డేటా టెర్మినల్ సహాయ పడుతుంది. 
* సమాచారాన్ని పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు, ఇతరులకు షేర్ చేసుకొనేలా ఐదు ఫోన్ నెంబర్లను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. 
* ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ వినియోగిస్తే..వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల..వారు ప్రయాణీస్తున్న వాహనం ఇతర మార్గాల్లోకి వెళితే..ఆ

* సమాచారాన్ని కంట్రోల్ రూం, బంధుమిత్రులకు పంపి అలర్ట్ చేస్తుంది. 
* డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపరిచారు. 
* యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు, సమీపంలోని పీఎస్‌ వివరాలు తెలసుకొనేందుకు ఆప్షన్లు కూడా ఉన్నాయి.