దయచేసి నన్ను బజారుకు లాగొద్దు, నా పిల్లలు చనిపోతామంటున్నారు- దువ్వాడ కుటుంబ వివాదంపై దివ్వెల మాధురి

ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా ఎవరూ నమ్మరు. నేను శ్రీనివాస్ తో మాట్లాడటం లేదన్నా ఎవరూ నమ్మరు.

దయచేసి నన్ను బజారుకు లాగొద్దు, నా పిల్లలు చనిపోతామంటున్నారు- దువ్వాడ కుటుంబ వివాదంపై దివ్వెల మాధురి

Divvela Mahduri : శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. రెండుళ్లుగా కుటుంబంలో విబేధాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. కాగా, తమ తండ్రి మరొక మహిళతో ఉంటూ తమను దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుర్లు. తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను ఒక మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని దువ్వాడ వాణి ఆరోపించారు. ఆమెకు తన భర్తతో కలిసి ఉండేందుకు ఏ ఒక్క అర్హత లేదన్నారు. ఇక ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై దివ్వెల మాధురి తీవ్రంగా స్పందించారు. దయచేసి తనను బజారుకు లాగొద్దని కన్నీటిపర్యంతం అయ్యారు.

”వాళ్ల ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్లే తేల్చుకోవాలి. నేను వాళ్ల ఫ్యామిలీలో జోక్యం చేసుకోను. దువ్వాడ కావాలంటే తిరిగి వెళ్లొచ్చు. నేను ఇండిపెండెంట్ మహిళను. నేను బతకగలను. దువ్వాడ శ్రీనివాస్ నాకు మార్గదర్శకుడు. నాకు దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలిచారు. భర్తకు దూరంగా ఉంటున్న ఒక మహిళ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమస్యలు రాకుండా దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉంటానని చెప్పారు. దువ్వాడ వాణి చెప్పిన మాటలు నమ్మి నన్ను బజారులోకి లాగొద్దు. నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ను బజారులోకి లాగొద్దు. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారిని పెంచి పెద్ద చేయాలి, వారికి పెళ్లిళ్లు చేయాలి. వాళ్లకి చాలా లైఫ్ ఉంది. ఇలాంటి వీడియోస్ వల్ల వాళ్లు ఎంత సఫర్ అవుతారో అర్థం చేసుకోండి.

దువ్వాడ వాణి ఏదో చెప్పిందని మీడియా వాళ్లు వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు. దువ్వాడ వాణి చెప్పింది నిజం కాదు కదా. ఆ వీడియోలు చూసి నా పిల్లలు నన్ను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి? ఉదయం నుంచి నా పిల్లలు ఏడుస్తున్నారు. చచ్చిపోతాం అంటున్నారు. నేను వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాసేస్తారా? సొసైటీలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడరా? ఎవరికీ ఫ్రెండ్స్, రిలేషన్స్ లేరా? దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు. దువ్వాడ వాణికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే భర్త దగ్గరికి వెళ్లి తీర్చుకోమనండి. లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి. కోర్టుకెళ్లి తేల్చుకోమనండి. అది అతడికి, ఆవిడకి సంబంధించిన విషయం. మధ్యలో నా లైఫ్ ని ఎందుకు లాగుతున్నారు? పిల్లలు ప్రశ్నిస్తారనే నేను శ్రీనివాస్ తో ఉందామని డిసైడ్ అయ్యాను. ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా ఎవరూ నమ్మరు. నేను శ్రీనివాస్ తో మాట్లాడటం లేదన్నా ఎవరూ నమ్మరు. నేను ఆయనతోనే ఉంటాను. ఒక ఫ్రెండ్ గా దువ్వాడ శ్రీనివాస్ తోనే ఉంటాను. శ్రీనివాస్ తో నా రిలేషన్ ఫ్రెండ్ షిప్ మాత్రమే” అని తేల్చి చెప్పారు మాధురి.