అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు హత్య

  • Published By: murthy ,Published On : November 28, 2020 / 02:03 PM IST
అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు హత్య

Updated On : November 28, 2020 / 3:34 PM IST

doctor murdered in avanigadda krishna district : కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది.

అవనిగడ్డలోని ప్రముఖ వైద్యుడు కోట శ్రీహరి రావును గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనే హత్య చేశారు. ఆయన పడకగదిలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉండగా కనుగొన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://10tv.in/telangana-kamareddy-husband-attack-on-wife-with-knife-in-dichpally/
దుండగులు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వాటిని పైకి తిప్పారు. శ్రీహరి రావు కుటుంబ సభ్యులు ఊరు వెళ్లటంతో ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.