ఆరోగ్యశ్రీ.. ఇక ఆంధ్ర రాష్ట్రమంతా!

  • Published By: vamsi ,Published On : November 10, 2020 / 01:29 PM IST
ఆరోగ్యశ్రీ.. ఇక ఆంధ్ర రాష్ట్రమంతా!

Updated On : November 10, 2020 / 2:12 PM IST

Dr YSR Aarogyasri:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రిలో చేరి వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉండగా.. ఇప్పుడు మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చెయ్యనున్నారు. నేటి నుంచి ఈ పథకం​ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రాబోతుంది.



https://10tv.in/free-corona-treatment-in-private-hospitals/
ఆసుపత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే YSR ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం చెయ్యనున్నారు. ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.



‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు పూర్తిబాధ్యత ప్రభుత్వానిదే అని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిందంటే ఆ ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.