EAPSET : మేలో ఈఏపీసెట్ 2022

ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ప్రొఫెసర్‌ కృష్ణమోహన్ లను నియమించగా ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.కిశోర్‌బాబు లను

EAPSET : మేలో ఈఏపీసెట్ 2022

Eapcet2022

Updated On : February 10, 2022 / 10:50 AM IST

EAPSET  : ఏపి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్‌ 2022 ను మే నెలలలో నిర్వహించనున్నారు. దీని నిర్వాహణ బాధ్యతను అనంతపురం జేఎన్టీయూకి అప్పగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహించేందుకు చైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఈఏపీ సెట్‌కు చైర్మన్, కన్వీనర్లుగా అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ జి.రంగజనార్దన , ప్రొఫెసర్‌ ఎమ్‌.విజయకుమార్ లను నియమించారు. ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ప్రొఫెసర్‌ కృష్ణమోహన్ లను నియమించగా ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.కిశోర్‌బాబు లను, పీజీ ఈసెట్‌కు ఎస్వీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి, ప్రొఫెసర్‌ ఆర్వీఎస్‌ సత్యనారాయణ లను, రీసెర్చ్‌ సెట్‌కు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్‌ డి.అప్పలనాయుడు లను, ఎడ్‌సెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.జమున, ప్రొఫెసర్‌ టీజీ అమృతవల్లిలను పీజీ సెట్‌కు యోగివేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎమ్‌.సూర్యకళావతి, ప్రొఫెసర్‌ ఎన్‌.నజీర్‌ అహ్మద్ లను , లాసెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.జమున, ప్రొఫెసర్‌ టి.సీతాకుమారిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయా సెట్లకు సంబంధించి నోటిఫికేషన్లు, పరీక్ష తేదీలు ఖరారు చేయాల్సి ఉంది.