Earth Tremors : చిత్తూరు జిల్లాను వణికిస్తున్న వరుస భూకంపాలు
చిత్తూరు జిల్లాలో భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపాలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తిరుపతిలో నీటి ట్యాంక్ పైకి లేచిన ఘటనను ఆ జిల్లా వాసులు ఇంకా మరువనేలేదు.

Earth Tremors Trigger Panic In Chittoor Village
Earth Tremors : చిత్తూరు జిల్లాలో భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపాలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఎక్కడ భూకంపం వస్తుందోనన్న భయంతోనే బిక్కుబిక్కుమని నిద్రలేని రాత్రులు గడిపేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో నీటి ట్యాంక్ పైకి లేచిన ఘటనను ఆ జిల్లా వాసులు ఇంకా మరువనేలేదు. ఇప్పటికే పలుచోట్ల భూప్రకంపనలు కూడా చోటుచేసుకున్నాయి. రెండు రోజులుగా పూతలపట్టు మండలం తుంబావరి పల్లెలో భూమి కంపిస్తోంది. రామకుప్పం మండల పరిధిలోని గడ్డురు, గెరిగిపల్లె, యనాది కాలనీ, కృష్ణ నగర్, గొరివిమాకుల పల్లి గ్రామాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం (నవంబర్ 26) భూమి స్వల్పంగా కంపించింది.
గత రెండు రోజులుగా భూమి నాలుగు సార్లు కంపించింది. భూకంపం భయంతో జిల్లా ప్రజలు ఇళ్లల్లో నుంచి రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. గురువారం రాత్రి నుంచి జనమంతా రోడ్ల మీదే జాగారం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. భారీ శబ్దంతో ఇళ్లలోని వస్తువులు కిందపడి పోయాయి. పలు గ్రామాల్లో చుట్టుపక్కల క్వారీ తవ్వకాలు చేపట్టడం ద్వారానే ఈ భూప్రకంపనలకు కారణంగా అనుమానిస్తున్నారు.
Read Also : AP Crime : పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన కొడుకు