Earthquakes : ఏపీలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానిక ప్రజలు.. ఆ ప్రాంతంలో తీవ్రత ఎక్కువ..

Earthquakes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలు ప్రాంతంలో రాత్రి 2గంటల సమయంలో స్వల్పంగా భూమి కపించింది.

Earthquakes : ఏపీలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానిక ప్రజలు.. ఆ ప్రాంతంలో తీవ్రత ఎక్కువ..

Earthquakes

Updated On : September 24, 2025 / 8:17 AM IST

Earthquakes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్పంగా భూమి కపించింది. అర్ధరాత్రి 2.22 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. విజయ్ నగర్ కాలనీ, గాయత్రీ నగర్, వడ్డేపాలెం, భాగ్యనగర్, శ్రీరామపురం, సీఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. స్థానిక ప్రజలు కొందరు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: AP Politics: కూటమి వర్సెస్ వైసీపీ.. ఎవరిది పైచేయి? ఎవరి ట్రాప్‌లో ఎవరు పడుతున్నట్లు?

ఈ ఏడాది మే నెలలో ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో పలువురు స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు రోజులపాటు భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు కారణంగా భూమి కంపించినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు.

అయితే, భూగర్భంలో చిన్నచిన్న కదలికలు వచ్చిన సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని గతంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.