Earthquake : పులిచింతల ప్రాజెక్టు, సూర్యపేట ప్రాంతాల్లో భూప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో వరుసు భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఇవాళ ఉదయం 7.15 నుండి 8.20 గంటల మధ్య భూమి కంపించింది.

Earthquake : పులిచింతల ప్రాజెక్టు, సూర్యపేట ప్రాంతాల్లో భూప్రకంపనలు

Earthqakes (1)

Updated On : August 8, 2021 / 12:36 PM IST

Pulichintala project and Suryapeta : తెలుగు రాష్ట్రాల్లో వరుసు భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణలో ఇవాళ ఉదయం వరుస భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఇవాళ ఉదయం 7.15 నుండి 8.20 గంటల మధ్య భూమి కంపించింది.

పులిచింతల వద్ద మూడు సార్లు భూమి కంపించింది. జడపల్లితండా, మాదదిరిపాడులో రెండుసార్లు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్కర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.3, 2.7, 3.0గా నమోదైనట్లు ఎన్ జీఆర్ఐ తెలిపింది.

దీంతో పాటు తెలంగాణలోని సూర్యపేట, చింతలపాలెం, మేల్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. స్థానికులు భయాందోళన ఉన్నారు. గత వారం రోజులుగా పులిచింతల సమీపంలో భూమి కంపిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.