CM Jagan : లీడర్ షిప్ పెంచే విధంగా‌ చదువులుండాలి.. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నాం : సీఎం జగన్

టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అవినాష్ పాల్గొన్నారు.

CM Jagan : లీడర్ షిప్ పెంచే విధంగా‌ చదువులుండాలి.. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నాం : సీఎం జగన్

Jagan

Updated On : June 20, 2023 / 12:23 PM IST

Jagananna Animutyalu Program : పదో తరగతి విద్యార్ధి ముఖంలో కాన్ఫిడెంట్ తనకు నచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ కాలేజీలు మార్చాలన్న కోరిక మరింత పెరిగిందన్నారు. పేద‌ విద్యార్ధులు చదువులకు దూరం కాకూడదనే స్కూళ్ళలో నాడు నేడు ద్వారా మార్పులు చేశామని తెలిపారు. బడులు తెరిచే సమయానికే‌ జగనన్న విద్యా కానుక కిట్ అందచేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో సీబీఎస్ సీ సిలబస్ అందుబాటులోకి వచ్చిందన్నారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మనం చదవుకుంటున్న స్కూళ్లలో అన్ని మారాయని వెల్లడించారు. గతంలో సబ్జెక్టు టీచర్లే ఉండని పరిస్ధితి.. సబ్జెక్టు టీచర్లు మూడవ తరగతి నుంచే చెప్పే ‌అడుగులు మన ప్రభుత్వంలో పడుతున్నాయని తెలిపారు.

MLA Muthireddy : ప్రజల ముందే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన కూతురు .. వదిలేదిలేదంటూ వార్నింగ్

క్లాస్ రూంలో డిజిటల్ బోధనతో ప్రతి పిల్లలకు చదువు మరింత‌ నేర్పించేంతగా‌ ప్రభుత్వ బడుల్లో జరుగుతుందన్నారు. మూడవ తరగతి నుంచి విద్యార్థులు ట్రో ఫుల్ ఎగ్జామ్ అంతర్జాతీయ స్ధాయిలో జరిగే‌ పరీక్ష కు ప్రిపేర్ చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడక తప్పదనేలా మారుస్తున్నామని, ప్రతి ఒక్కరు డిగ్రీ చదవాలని సూచించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదని విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా‌ ఏపీ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉన్నత‌ విద్య కోసం ప్రపంచంలో 350 యూనివర్శిటీల్లో సీటు తెచ్చుకోండి..ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. పిల్లలంతా ప్రతి రంగంలో ఎదగాలని ఆకాంక్షించారు. నాలుగేళ్లలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ధ్యాస దేశంళో ఏక్కడా లేదన్నారు. రాబోయే‌ రోజుల్లో ఐబీ సిలబస్ ప్రభుత్వ బడుల్లో తెస్తామని తెలిపారు. పరీక్ష పత్రాలలో ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్ కు ధీటుగా మార్పులు తెస్తామని చెప్పారు.

Bombay High Court : మోసపూరిత ఖాతాల ప్రకటనపై బ్యాంకర్లకు ఎదురుదెబ్బ.. ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లపై బాంబే హైకోర్టు స్టే

నిరు పేదలంతా ప్రపంచాన్ని ఏలే‌ రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. ఈ వయసు నుంచే మీ ఆలోచనలు పెరిగి శిఖరాలకు ఎదగాలన్నారు. లీడర్ షిప్ పెంచే విధంగా‌ చదువులు ఉండాలని సూచించారు. రాబోయే‌ రోజుల్లో ఎడ్యుకేషన్ రంగం మారబోతుందన్నారు. ర్యాంకులు తెచ్చుకోని వారు అధైర్య పడొద్దు.. ప్రతి ఒక్కరికీ సంకల్పం ముఖ్యమన్నారు. డబ్బులున్న వారికే ప్రైవేట్ బడులు.. మన ప్రభుత్వంలో ఎవరు బాధపడొద్దు.. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా వైసీపీ ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్రంలో ప్రతిభ కనబరిచిన 22,710 మంది విద్యార్ధులను సత్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది విద్యార్ధులను సత్కరిస్తామని పేర్కొన్నారు. బడుల్లో ఇంకా‌ మార్పులు చేస్తామని, విద్యార్ధులు మరింతగా రాణించాలన్నారు. ఎస్ ఎస్ సీలో మగపిల్లలు 18. ఆడపిల్లలు 24 మంది.. ఇంటర్‌లో మగ పిల్లలు ఇద్దరు, ఆడపిల్లలు 24 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలను బడులకు పంపిస్తే‌ మరింతగా రాణిస్తారనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు.