AP Elections : ఏపీలో ఎన్నికలు.. ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి నోటిఫికేషన్
పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది.

AP Elections : ఏపీలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కడప జడ్పీ చైర్పర్సన్, కర్నూలు జడ్పీ కో-ఆప్టెడ్ మెంబర్, 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్‌లో 12 మంది కోఆప్టెడ్ సభ్యులు, 214 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా 7 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 27న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : బిల్ గేట్స్‌తో చంద్రబాబు నాయుడు భేటీ.. వీటిపై చర్చ.. ఏపీ సీఎం ఏమన్నారంటే?
మరోవైపు ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు ఉంటుంది. గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, p4 అమలు, సంక్షేమ పథకాల అమలు ప్రధాన ఎజెండాగా కలెక్టర్ల సమావేశం జరగనుంది.