TDP: ఈ నియోజక వర్గం నుంచి జనసేన పోటీ చేస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం: టీడీపీ నాయకులు
ఈ మేరకు టీడీపీ నాయకులు సిద్ధం అంటూ అత్యవసర సమావేశంలో తీర్మానం చేశారు.

TDP, Janasena
ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. జనసేనకు పోలవరం టికెట్ ఇస్తే ఓడిపోతామని, టీడీపీ ఆశావాహ అభ్యర్థి బోరగం శ్రీనివాస్‌కే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టికెట్ కేటాయింపుపై సరిగ్గా చేయాలని అన్నారు.
లేదంటే టీడీపీకి రాజీనామా చేయాలనుకుంటున్నామని పలువురు నాయకులు అన్నారు. పోలవరం నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు తప్పవని చెబుతున్నారు. ఈ మేరకు టీడీపీ నాయకులు సిద్ధం అంటూ అత్యవసర సమావేశంలో తీర్మానం చేశారు. పోలవరం అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయిస్తారన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయి.
గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీలో బోరగం శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కష్టపడుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఎన్నికలు రాబోతున్నాయ్.. చంద్రబాబు వీటితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి