ట్రాన్స్ జెండర్ తో ఫేసు బుక్ ప్రేమ….కట్నం కోసం వేధింపులు

ట్రాన్స్ జెండర్ తో ఫేసు బుక్ ప్రేమ….కట్నం కోసం వేధింపులు

Updated On : February 20, 2021 / 3:57 PM IST

Eluru man dowry harassment for a transgender woman : ఫేస్ బుక్ లో ఆమె పరిచయం అయ్యింది. కొన్నాళ్లుకు కానీ తెలియలేదు, అతడు ఆమెగా మారిన వ్యక్తి అని. అయినా సరే నిన్నే పెళ్ళాడుతా అంటూ తాళి కట్టాడు. ఇప్పుడు నువ్వునాకు వద్దంటూ వేధింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడికి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్ బుక్ లో భూమి అనే యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ లోపు భూమి స్త్రీ కాదని ట్రాన్స్ జెండర్ అని తెలుసింది, అయినా సరే నువ్వే కావాలి అంటూ ప్రేమాయణ కొనసాగించాడు.

2020 జనవరిలో పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఎక్కడా మిస్ అండర్ స్టాండింగ్ జరిగిందో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటూ ఆమెతో గొడవపడటం ప్రారంబించాడు. కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్దుబాటు చేసినా… అదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించటం మొదలెట్టాడు.

తారక తో విసిగిపోయిన భూమి ఇటీవల హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తారక ను అరెస్ట్ చేశారు.