Ys Jagan: సీఎం చంద్రబాబుపైనా 24 కేసులు ఉన్నాయి, ఆయనను కూడా నడిరోడ్డుపైకి తెచ్చి శిక్షిస్తారా? జగన్ ఫైర్
విద్యారంగం నాశనమైంది, వైద్య రంగం దివాలా తీసింది, ఆరోగ్యశ్రీ సేవలు అందే పరిస్థితి లేదు, వ్యవసాయ రంగం దిగజారిపోయింది, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం.

YS Jagan Mohan Reddy
Ys Jagan: తెనాలిలో పోలీసుల థర్డ్ డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబసభ్యులను వైసీపీ చీఫ్ జగన్ పరామర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ఆరోపించారు. ఏ రకంగా రాజ్యాంగం అదుపు తప్పింది అంటే.. ఏకంగా పోలీస్ వ్యవస్థ పక్కదారి పడుతోందన్నారు. ప్రతి సంఘటన టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోందన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జగన్.
వ్యతిరేక గొంతును వినిపిస్తే వైసీపీ మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. పాలన అంత పైశాచికంగా మారిందని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థ వికృతంగా మారిందని చెప్పటానికి తెనాలి సంఘటనే నిదర్శనం అన్నారు జగన్. పోలీసుల చేతిలో తన్నులు తిన్న పిల్లలు రాకేశ్, విక్టర్, కరీముల్లాలు వెనకబడిన వర్గం వారని.. రాకేశ్ అనే పిల్లాడు తెనాలిలో ఉండడని హైదరాబాద్ లో పని చేస్తాడని జగన్ తెలిపారు. అతనిపై ఏదో పాత కేసు ఉందన్నారు. తెనాలిలో కుటుంబసభ్యులను పరామర్శించడానికి వచ్చాడని చెప్పారు. అతడి స్నేహితులు వచ్చిన సందర్భంలో వారిపైనా కేసులు పెట్టారని వెల్లడించారు.
”ఐతా నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చిరంజీవి అనే కానిస్టేబుల్.. సివిల్ డ్రస్ లో ఉన్నాడు. వేరే వాగ్వాదం జరుగుతోంది. వీళ్ళ ఏరియాకు వచ్చి గొడవపడుతున్న కానిస్టేబుల్ ను ప్రశ్నించడంతో వీరిపై చిరంజీవి దౌర్జన్యం చేశాడు. 25న ఆ అంశంలో ముగ్గురు యువకులను కేసుల పేరుతో రాత్రంతా కొట్టారు. 26న దగ్గరగా ఉన్న ఐతానగర్ లో రోడ్ పై కొట్టారు. వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారు. ఇద్దరు సీఐలు వీరిని కొట్టారు. కాళ్లపై బొబ్బలు వచ్చేలా కొట్టారు. పట్టపగలే నడిరోడ్డుపై రెండుసార్లు కొట్టారు. కొట్టడమే కాకుండా మూడు రోజులు స్టేషన్ లో ఉంచారు.
Also Read: జగన్‌కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు రెడీ..!
పోలీసులే యువకుల జేబులో కత్తులు పెట్టి వీఆర్వోలను పిలిపించి మారణాయుధాలు కలిగున్నట్లు కేసులు పెట్టారు. విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి మాజీ విలేకరి. విద్యారంగం నాశనమైంది, వైద్య రంగం దివాలా తీసింది, ఆరోగ్యశ్రీ సేవలు అందే పరిస్థితి లేదు, వ్యవసాయ రంగం దిగజారిపోయింది, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం. పోలీసులు డాక్టర్ ని సైతం బెదిరించినట్టు తెలుస్తుంది.
నెల రోజుల తర్వాత పోలీసులు కొట్టిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను రికార్డ్ చేసింది కూడా పోలీసులే. చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే. పోలీసులు చేసిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు యువకులపై నింద వేస్తున్నారు. తప్పును ఒప్పుగా మారుస్తున్న పోలీసులను ఒకటే ప్రశ్నిస్తున్నా. పోలీసుల వల్ల గాయపడ్డ విక్టర్ జూనియర్ న్యాయవాది కాదా.
నడిబజారులో కొట్టి యువకుల కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయటం న్యాయమా? మంగళగిరికి చెందిన వారిని తెనాలి తీసుకొచ్చి కొట్టడం వెనకున్న కారణమేంటి? అవాస్తవాలను పోలీసులు నిజం చేసేందుకు ఇదంతా చేస్తున్నారు. కరీముల్లా మీద ఎలాంటి కేసులు లేవు. తెనాలి ఘటన తర్వాతే ఈ ముగ్గురిపై రౌడీషీట్ నమోదు చేశారు. పోలీసులు కావాలనే దుర్మార్గంగా వ్యవహరించారు. చంద్రబాబు అనుకూల మీడియా గంజాయి బ్యాచ్ గా చిత్రీకరిస్తోంది.
నేరాలను, కేసులను విచారించాల్సింది, నేర నిర్ధారణ చేయాల్సింది న్యాయస్థానాలు మాత్రమే. పోలీసులకు ఆ హక్కు లేదు. సీఎం చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి. ఆయనను కూడా నడిరోడ్డు మీద కొట్టడం ధర్మమా? దాచేపల్లిలో హరికృష్ణ, రాజమండ్రిలో సాగర్ అనే వ్యక్తిపై ఇదే విధంగా పోలీసులు దాడులు చేశారు” అని జగన్ నిప్పులు చెరిగారు.