Ambati Rambabu : ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు- అంబటి రాంబాబు ఆవేదన..

నా మీద, మా నాయకుడి మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి ఫిర్యాదు చేశాను.

Ambati Rambabu : ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు- అంబటి రాంబాబు ఆవేదన..

Updated On : December 9, 2024 / 12:49 AM IST

Ambati Rambabu : సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా చేస్తున్న పోస్టింగ్ లపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మంత్రి నారా లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు అనేకమంది తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయకపోవడంతో తాము ఎస్పీ సతీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లామన్నారు అంబటి రాంబాబు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీనిపై వైసీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు అంబటి రాంబాబు.

”నేను స్వయంగా వెళ్లి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో నాలుగు ఫిర్యాదులు ఇచ్చాను. నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి, మా నాయకుడు జగన్ మీద పెట్టిన పోస్టుల గురించి ఫిర్యాదు చేశాను. మంత్రి నారా లోకేశ్ వ్యంగంగా పోస్టులు పెట్టారు. నా మనోభావాలు, జగన్ మనోభావాలు, జగన్ అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేశ్ పోస్టు పెట్టారు. స్వాతి రెడ్డి, అజయ్ చౌదరి పేరుతో పోస్టులు పెట్టారు.

సోషల్ మీడియాలో మా మనోభావాలను దెబ్బతీసే విధంగా పెట్టిన పోస్టులను కోట్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశా. జగన్ ఫోటోకు దండ వేయడం దారుణం. మా నాయకుడు, ఆయన భార్య మీద పెట్టిన పోస్టులు.. వీటన్నింటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా 19వ తేదీన ఫిర్యాదు ఇచ్చాను” అని అంబటి రాంబాబు తెలిపారు.

 

Also Read : ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరు.. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం: జగన్