Vidadala Rajini : మా జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది, ఎవరినీ వదలం, వడ్డీతో సహా తిరిగిస్తాం- మాజీమంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్

దోపిడీలు, ఇల్లీగల్ పనులు చేసి, జేబులు నింపుకుని రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా.. నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు.. రాజకీయాలు ఇక్కడే చేస్తాను.

Vidadala Rajini : మా జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది, ఎవరినీ వదలం, వడ్డీతో సహా తిరిగిస్తాం- మాజీమంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్

Updated On : February 8, 2025 / 5:03 PM IST

Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినీ టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై నిప్పులు చెరిగారు. గుర్తు పెట్టుకోండి.. ఎవరినీ వదలను.. వడ్డీతో సహా తిరిగిస్తాం.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు విడదల రజినీ. తన కుటుంబం లక్ష్యంగా ఎమ్మెల్యే పుల్లారావు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తనది పురుషోత్తమపట్నం అని గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. తన పార్టీ, తన కుటుంబం జోలికి వస్తే వదిలేది లేదని తేల్చి చెప్పారామె. చిలకలూరిపేటలో తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు విషయంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని విడదల రజినీ ఆరోపిస్తున్నారు.

అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తారా?
”పుల్లారావు గారు.. నాకు నవ్వు వస్తోంది. నా రాజకీయ అనుభవం ఏడేళ్లు. నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ల రాజకీయం తలదించుకుంది ఈరోజుతో అనిపిస్తోంది. అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను కానీ, నా కుటుంబసభ్యులను కానీ, నా నియోజకవర్గ ప్రజలను కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించి, భయపెట్టి, అక్రమ కేసులు పెడితే.. ఎవ్వరం భయపడం.

Also Read : ఎవరీ పర్వేష్ వర్మ? కేజ్రీవాల్‌ను ఢిల్లీలో మట్టికరిపించిన బీజేపీ నేత..!

మీరు పెట్టిన ప్రతిసారీ ఇంకా బలంగా ఎదుర్కొంటాం. ఇంకా బలంగా నిలబడతాం. ముందుకు వెళ్తాం. దోపిడీలు, ఇల్లీగల్ పనులు చేసి, జేబులు నింపుకుని రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా.. నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు.. రాజకీయాలు ఇక్కడే చేస్తాను.

మీరు ఎక్కడున్నా, ఏ ఊళ్లో దాక్కున్నా, మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం..
గుర్తు పెట్టుకోండి 30 నుంచి 40 సంవత్సరాలు.. ఆ దేవుడు చల్లగా చూస్తే.. మీరు ఎక్కడున్నా, ఏ ఊళ్లో దాక్కున్నా, మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా మీకు తిరిగిస్తాం. కొంతమంది ఎమ్మెల్యేని చూసుకుని, అధికారులను చూసుకుని కయ్యానికి కాలు దువ్వుకుందామని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పిచ్చి పిచ్చి కథలు అల్లి, కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో.

ఎవరినీ మర్చిపోను, వదిలిపెట్టను, మీ సంగతి తేలుస్తా..
మీ ఎవరినీ మర్చిపోను. ఎవరినీ వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తా. తేల్చి రాజకీయం చేసుకుంటా. అధికారులందరి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు ప్రజలకు అవసరమైన పనులు చేయండి. ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి, అండగా ఉండండి. ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనను కొనసాగించండి. అక్రమాలు, అవినీతి చేసే వారికి అండగా ఉండొద్దు” అని విడదల రజినీ అన్నారు.

Also Read : ఢిల్లీ ఫలితాల్లో ‘ఆప్’ పతనానికి 5 ప్రధాన కారణాలేంటి? ఈ తప్పిదాలే కేజ్రీవాల్ పార్టీని దెబ్బతీశాయా?

మా జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది..
”కొందరు అధికారులు అత్యుత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. అలాంటి వారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యుత్సాహం చూపించే ఆఫీసర్లకు ఇదే నా వార్నింగ్. మరింత అత్యుత్సాహం చూపిస్తున్న టీడీపీ వాళ్లని, ఇక్కడున్న ఎమ్మెల్యే పుల్లారావుని.. మీరు మా జోలికి వస్తే.. తప్పుడు కేసుల్లో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెడితే.. రాసి పెట్టుకోండి.

న్యూటన్స్ ధర్డ్ లా గుర్తు పెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం. మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుంది. అప్పుడు మీ సంగతి తేలుస్తాం” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీమంత్రి విడదల రజినీ.