Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు..

తనకి అనారోగ్యంగా ఉందని జైలు సిబ్బందికి చెప్పారు వంశీ.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు..

Updated On : May 3, 2025 / 10:56 PM IST

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది వంశీని జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీకి గుండె సంబంధిత టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. ఆ తర్వాత జైలు సిబ్బంది వంశీని మళ్లీ జైలుకి తరలించారు.

జైల్లో ఉన్నప్పుడు వంశీకి కాళ్ల వాపు వచ్చింది. దీంతో తనకి అనారోగ్యంగా ఉందని జైలు సిబ్బందికి చెప్పారు వంశీ. 2 గంటల పాటు పలు రకాల టెస్టులు చేసిన తర్వాత తిరిగి జైలుకి తరలించారు. వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పడంతో.. జైలు సిబ్బంది వంశీని తిరిగి జైలుకి తరలించారు.

Also Read: అది నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా- వైసీపీకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్

సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్‌ చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా వంశీ జైల్లో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కు అప్లయ్ చేసుకున్నారు. దీనిపై వాదనలు జరుగుతున్నాయి.