Bhuma Akhila Priya: అది నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా- వైసీపీకి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్
అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూల్చివేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలన్నీ వైసీపీ హయాంలో జరిగినవే అన్నారు.

Bhuma Akhila Priya
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వారికి సవాల్ విసిరారు. తాను బి ట్యాక్స్ వసూలు చేస్తున్నానని నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని ఆమె చెప్పారు. నా పైన చేసిన ఆరోపణలపై నేను చర్చకు సిద్ధం.. వైసీపీ వాళ్ళు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. ఆళ్ళగడ్డలో నేరాలు ఘోరాలు జరుగుతున్నట్లు ఒక పత్రికలో ఆర్టికల్ రాశారని, నిజాలు ఏంటో ఆళ్ళగడ్డ ప్రజలకు తెలీదా? మాకు ఓట్లు వేసిన వాళ్ళకు తెలీదా? అని ఆమె అన్నారు.
అహోబిలంలో కన్ స్ట్రక్షన్ చేయాలంటే పంచాయతీ తీర్మానం ఉండాలి. పంచాయతీకి సర్పంచ్ వైసీపీ వాళ్ళు ఉన్నపుడు అవినీతి ఎవరు చేస్తున్నట్లు మీరే చెప్పాలి అని భూమా అఖిలప్రియ అన్నారు. అహోబిలంలో ఇల్లీగల్ గా నిర్మించిన వాటిని కూల్చడానికి నేను సిద్ధం, వైసీపీ వాళ్లు రెడీనా అని సవాల్ చేశారు భూమా అఖిలప్రియ. అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూల్చివేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలన్నీ వైసీపీ హయాంలో జరిగినవే అన్నారు.
Also Read: ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆచూకీ ఎక్కడ? 20రోజులకు పైగా కనిపించడం లేదు.. ఆ భయమే కారణమా?
ఇందిరమ్మ కాలనీయే లేదు, ఇందిరమ్మ ఇళ్లలో ఇంద్రభవనం అని రాశారు అని మండిపడ్డారు. గోడ కూలిపోయిన దానికి చంద్రబాబుకి ఏం సంబంధం? అని నిలదీశారు. వైసీపీ నాయకులు అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు.