భార్యతో గొడవ..ఇద్దరు చిన్నారులను నేలకేసి కొట్టిన తండ్రి

ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. చిన్నారుల పాలిట కసాయివాడిలా మారాడు. భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉంది.

భార్యతో గొడవ..ఇద్దరు చిన్నారులను నేలకేసి కొట్టిన తండ్రి

Father Attempted Murder Two Children

Updated On : July 10, 2021 / 11:27 AM IST

Father attempted murder two children : ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. చిన్నారుల పాలిట కసాయివాడిలా మారాడు. భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉంది.

దీంతో స్థానికులు వెంటనే తీవ్ర గాయాలు పాలైన చిన్నారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈ దారుణం జిల్లాలోని సాలూరులో చోటుచేసుకుంది. ఈ దారుణంపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు కసాయి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు కాస్తా ఓ పసిబిడ్డ ప్రాణం తీయగా..మరో బిడ్డను ప్రాణాపాయంలో పడేసింది.

కాగా..కుటుంబ కలహాలతో ఎంతోమంది చిన్నారులు అనాథలవుతున్నారు. కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. విచక్షణ మరచిన కన్నవారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొన్ని ఘటనల్లో చిన్ననాటే ఎన్నో హింసలకు గురవుతున్నారు. ఇలా తల్లిదండ్రుల కోపాలు, కలహాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి.