Cyclone Fengal: ఫెంగాల్ తుపాను ఎఫెక్ట్.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

మిళనాడు రాష్ట్రంలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం మూసివేశారు. విమానాశ్రయంలోకి వర్షపు నీరు చేరడంతో ..

Cyclone Fengal: ఫెంగాల్ తుపాను ఎఫెక్ట్.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

Cyclone Fengal

Updated On : December 1, 2024 / 10:11 AM IST

Cyclone Fengal: ఫెంగాల్ తుపాను తీరందాటింది. మహాబలిపురం, కర్తెకల్ మధ్య తుపాను తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ తుపాను బలహీనపడుతుంది. తుపాను తీరం దాటడంతో తీరం వెంట గంటకు 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Also Read: Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ఏం చదువుకున్నారో తెలుసా.. అప్పట్లోనే అంత డిఫరెంట్ గా చదివి..

ఏపీలోని రాయలసీమ జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతుంది. దీంతో నెల్లూరు నగరంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎడతెరిపిలేని మోస్తరు వర్షం కురుస్తోంది.

 

తమిళనాడు రాష్ట్రంలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం మూసివేశారు. విమానాశ్రయంలోకి వర్షపు నీరు చేరడంతో దాదాపు 110 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అయితే, ఆదివారం తెల్లవారు జామున 4గంటలకు ఎయిర్ పోర్టులో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే, విమాన సర్వీసులు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో చెన్నై ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా 143 సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. చెన్నైలో వర్షాలకు ప్రభావితమైన ప్రజలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.