Fire Broke Out : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ లో చెలరేగిన మంటలు

పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో ప్రాణాపాయం తప్పింది.

Fire Broke Out : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ లో చెలరేగిన మంటలు

fire accident

Updated On : August 30, 2023 / 10:10 AM IST

Fire Broke Out In Srikakulam : శ్రీకాకుళం జిల్లాలోని ఓ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగింది. పాతపట్నంలోని ప్రధాన రహదారిలో ఉన్న స్నేహ షాపింగ్ మాల్ లో షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపింగ్ మాల్ లోని బట్టలు, ఫర్మీచర్ పూర్తిగా ధ్వంసం అయింది.

Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. గంగారం జేపీ సినిమాస్ లో చేలరేగిన మంటలు

పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది.

షాపింగ్ మాల్ లో మంటలు రావడంపై అధికారులు విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఏ విధంగా జరిగింది అన్న విషయాలపై దర్యాప్తు చేపట్టారు.