Fire In Passenger Train: నిడదవోలు – నర్సాపురం ప్యాసింజర్‌ రైలులో చెలరేగిన మంటలు ..

ప్రమాదం సమయంలో ప్యాసింజర్ రైలు నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్తుంది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Fire In Passenger Train: నిడదవోలు – నర్సాపురం ప్యాసింజర్‌ రైలులో చెలరేగిన మంటలు ..

Nidadavolu to Narasapuram train

Updated On : August 23, 2023 / 11:06 AM IST

Passenger Train: నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్తున్న ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలును సత్యవాడ రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Fire In Vande Bharat Train : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, భయాందోళనలో ప్రయాణీకులు

ప్రమాదం సమయంలో ప్యాసింజర్ రైలు నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్తుంది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రైలును తణుకుకు తరలించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.