త్వరలో BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 01:57 PM IST
త్వరలో BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం జగన్

Updated On : July 20, 2020 / 3:17 PM IST

ఈ నెలాఖరు కల్లా BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా ? లేదా ? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని, అందరికీ పథకాలు అందేలా చూడడం ప్రధాన బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు.

2020, జులై 20వ తేదీ సోమవారం బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 2,12,40,810 మంది బీసీలకు 22,685.74 కోట్ల రూపాయలను నగదు బదిలీ ద్వారా అందించామన్నారు.

బీసీల అభ్యున్నతి కోసం ఇంత ఫోకస్‌గా గతంలో ఎవరూ, ఎప్పుడూ పని చేయలేదన్నారు. రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నట్లు, కొత్తవాటితో కలుపుకుని మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటైందన్నారు. గతంలో 69 కులాలకే ప్రాధాన్యత, ఇప్పుడు మొత్తం బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్లలో ప్రాధాన్యతనిస్తామన్నారు సీఎం జగన్.