Anil Kumar : నా ఆస్తులపై తిరుమలలో ప్రమాణం చేస్తా.. మిగిలిన బ్యాలెన్స్ ఎప్పుడిస్తారు? : ఎమ్మెల్యే అనిల్ కుమార్

లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో దొంతాలిలో 25 ఎకరాల భూమి తనదేనని.. దాని విలువ రూ.5 కోట్లు అని పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యాక రూ.6 కోట్ల విలువైన భూమిని విక్రయించానని చెప్పారు.

Anil Kumar : నా ఆస్తులపై తిరుమలలో ప్రమాణం చేస్తా.. మిగిలిన బ్యాలెన్స్ ఎప్పుడిస్తారు? : ఎమ్మెల్యే అనిల్ కుమార్

Anil Kumar (1)

Anil Kumar Countered Lokesh : టీడీపీ నాయకుడు నారా లోకేష్ కు ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) కౌంటర్ ఇచ్చారు. లోకేష్ తనకు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని అన్నారు.. తన ఆస్తుల వివరాలు అంటూ డాక్యుమెంట్లను విడుదల చేశారని తెలిపారు. తన ఆస్తులపై తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పానని పేర్కొన్నారు. “మీ పార్టీ నేతలు.. నిన్ను నమ్ముకుంటే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే” అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం అనిల్ కుమార్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.

లోకేష్ ఆరోపణల వల్ల తన చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నారు. బృందావనంలో కోట్ల రూపాయల విలువైన నాలుగు ఎకరాల భూమి ఉందన్నారని తెలిపారు. ఇస్కాన్ సిటీలో 87 ఎకరాల ఆస్తి ఉందని చెప్పారని వెల్లడించారు. నిజంగా ఆ భూములు ఉంటే 90 శాతం మీడియా, నెల్లూరు ప్రజలే తీసుకోండి.. మిగిలింది తనకు ఇస్తే చాలు అని చమత్కరించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాన్ఫిడెన్స్ ఏంటి.. గోదావరి జిల్లాలపై వైసీపీ ఎందుకు ఫోకస్ పెంచింది?

లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో దొంతాలిలో 25 ఎకరాల భూమి తనదేనని.. దాని విలువ రూ.5 కోట్లు అని పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యాక రూ.6 కోట్ల విలువైన భూమిని విక్రయించానని చెప్పారు. తన ఆస్తిని అమ్ముకుంటే మరో చోట కొనకూడదా అని ప్రశ్నించారు. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. వెంకటేశ్వరపురంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేస్తానని తెలిపారు.

లోకేష్ వచ్చినా.. టీడీపీలోని మాజీ మంత్రులు వచ్చినా.. రాకున్నా తాను ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. ఖర్జూరపు నాయుడు ఇచ్చిన రెండున్నర ఎకరాల ఆస్తితోనే రాజకీయాలు చేశామని లోకేష్ ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు. మాజీమంత్రి నారాయణ అమరావతిలో ఆస్తులు లేవని, బినామీ పేర్లతో ఆస్తులు లేవని ప్రమాణం చేస్తారా అని నిలదీశారు.

Karumuri Nageshwara Rao : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎన్ని పార్టీలు కలిసినా సింగిల్ గానే పోటీ : మంత్రి కారుమూరి

“నా ఆస్తులు అంటూ లోకేష్ విడుదల చేసిన ఆస్తుల విలువ కన్నా.. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ ఎక్కువ” అని వెల్లడించారు. తనకు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని లోకేష్ జాబితా విడుదల చేశారని పేర్కొన్నారు. తనకున్నవి అందులో పట్టుమని 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమేనని.. మిగిలిన బ్యాలెన్స్ తనకు ఎప్పుడు, ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. లేకపోతే ఈ ఆస్తులు అన్నీ అనిల్ వేనని ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.