Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జోక్యం చేసుకోమని కేసీఆర్‌ను నేనే కోరా.. బిడ్‌లో పొల్గొందుకు సిద్ధంగా ఉన్నా : మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హీటె పుట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

former CBI JD Lakshminarayana to participate in vizag steel plant bid
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనటానికి తాను రెడీగా ఉన్నానంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హీటె పుట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో పలు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న క్రమంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు సంచలన విషయాలు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనటానికి తాను రెడీగా ఉన్నానంటూ సంచలన ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను నేనే కోరానని తెలిపారు.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ కు ఎవరు అర్హులు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..
స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక నా ప్రమేయం కూడా దోహదం చేసి ఉండొచ్చని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవటానికి ఏ రాష్ట్రం ముందుకొచ్చిన ఆహ్వానించాలని అన్నారు ఈసందర్భంగా లక్ష్మీనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆప్ ఇంట్రెస్ట్ లో పాల్గొనటానికి అవసరమైన అర్హతపై సీఏతో చర్చించానని..ఒకవేళ రిజెక్ట్ చేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనటానికి నేను రెడీగా ఉన్నానని దాని కోసం అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్నానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.
తన సూచన మేరకు స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కల్పించుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవటానికి ఎవరు ముందుకొచ్చినా ఆహ్వానించాలని పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు లక్ష్మీనారాయణ.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం కీలక ప్రకటన