Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం కీలక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు తొలుత నిధులు ఇచ్చి.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Vizag Steel Plant
Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మాటలు తూటాలు పేలుతోన్న వేళ కేంద్ర ఉక్కు శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ కర్మాగార ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి స్తంభన లేదని చెప్పింది.
పెట్టుబడుల ప్రక్రియపై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై ఈ మేరకు తాము స్పష్టత ఇస్తున్నామని తెలిపింది. RINL పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రక్రియ పురోగతిలో ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు తొలుత నిధులు ఇచ్చి ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో, ఈ ప్రతిపాదనల బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుండడంతో ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని పలు పార్టీలు చెప్పుకుంటున్నాయి. ప్రైవేటీకరణ జరగడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ఉక్కు శాఖ స్పష్టతనిచ్చింది.

Vizag Steel Plant