TDP Leader Somireddy : మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Somireddy Chandramohan Reddy
Somireddy Chandramohan Reddy : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి క్వార్జ్ ను అక్రమంగా తవ్వితీస్తున్నారని, వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో గత నాలుగు రోజుల నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సోమిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత 2.30 గంటలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని శిబిరం నుంచి బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో అర్థరాత్రి కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Also Read : Congress: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు
సోమిరెడ్డి దీక్షాశిబిరం వద్ద సోమవారం కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో హిజ్రాలు దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే సోమవారం రాత్రి సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని దీక్షను విరమించాలని పోలీసులు సోమిరెడ్డిని కోరారు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలను అమలుపర్చాలని, అలా జరిగితేనే దీక్షను విరమిస్తానని సోమిరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో శిబిరం వద్ద ఉండేందుకు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.
Also Read : JanaSena: మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. వైసీపీలో చేరిన పలువురు జనసేన నేతలు
సోమవారం అర్థరాత్రి దాటినతరువాత 2.30గంటల సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. పోలీసుల చర్యలను టీడీపీ నేతలు అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం సోమిరెడ్డిని బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు.