రోజుకి ఒకరికి ఎంత ఇసుక ఇస్తారు? ఛార్జీలు ఎంత? పేమెంట్ ఎలా చేయాలి? ఉచిత ఇసుక పాలసీ విధివిధినాలు తెలుసుకోండి..

ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయబోతున్నామని కలెక్టర్ సృజన తెలిపారు.

రోజుకి ఒకరికి ఎంత ఇసుక ఇస్తారు? ఛార్జీలు ఎంత? పేమెంట్ ఎలా చేయాలి? ఉచిత ఇసుక పాలసీ విధివిధినాలు తెలుసుకోండి..

Free Sand Policy : ఏపీ ప్రభుత్వం జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఉచిత ఇసుక విధానం గురించి పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక ఎక్కడ ఇస్తారు? ఇసుక కోసం ఎక్కడికి వెళ్లాలి? ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలి? రోజుకి ఒక మనిషికి ఎంత ఇసుక ఇస్తారు? వాహనాలు తీసుకెళ్లాలా? మెయింటెన్స్ ఛార్జీలు ఎంత? పేమెంట్ ఎలా చేయాలి? ఇలాంటి సందేహాలు ఎన్నో ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించారు. ఉచిత ఇసుక పాలసీ విధివిధినాలు గురించి వారు కీలక వివరాలు తెలియజేశారు.

ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రేపటి (జూలై 8) నుంచి ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయబోతున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లాలో ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందజేయబోతున్నామని చెప్పారు. 8 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచితంగా ఇసుకను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.

”సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేందుకు రెడీగా ఉన్నాం. ఏ స్టాక్ యార్డులో ఎంత ఇసుక నిల్వలు ఉన్నాయి అనే వివరాలు తెలియజేస్తాం. డైరెక్టర్ మైన్స్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా కొన్ని మెయింటెన్స్ చార్జీలు ఉంటాయి. లోడింగ్, అన్ లోడింగ్, ర్యాంప్ మెయింటెన్స్ కోసం ఛార్జీలు ఉంటాయి. అలాగే కొన్ని ట్యాక్సులు ఉంటాయి. ఛార్జీల వివరాలు ప్రెస్ ద్వారా, వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తాం. ఇవన్నీ చూసుకుని తమకు దగ్గరగా ఉండే స్టాక్ యార్డు ఏదో చూసుకుని ప్రజలు రావాల్సి ఉంటుంది. ఇక కొన్ని రోజుల పాటు ఇసుక కావాల్సిన వారు సొంతంగా వాహనాలు తెచ్చుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఎవరు ముందుగా వచ్చి క్యూలో ఉంటారో వారికి ముందుగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది.

మెయింటెన్స్ ఛార్జీలు కలెక్ట్ చేస్తాం. ఆ ఛార్జీలు కూడా పూర్తిగా డిజిటల్ విధానంలోనే. నగదు రూపంలో తీసుకోము. లైన్ లో నిల్చోవడం, క్యాష్ డిజిటల్ పేమెంట్ చేయడం, దానికి సంబంధించిన రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇక, ఒక వ్యక్తికి ఒక ఆధార్ నెంబర్ కి రోజుకి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇస్తాం. అంతకుమించి ఇవ్వము. ఇసుక కావాల్సిన వ్యక్తి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తీసుకుంటాం. ఏ అడ్రస్ కి ఆ ఇసుక వెళ్తోంది అనే వివరాలు కూడా తీసుకుంటాం. కొన్ని రోజులు ఆన్ లైన్ విధానం ఉండదు.

ఇసుక కావాల్సిన వ్యక్తులు తమ వాహనాలతో ఇసుక స్టాక్ పాయింట్ కు రావాల్సి ఉంటుంది. మెయింటెన్స్ ఛార్జీలు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. సచివాలయ సిబ్బంది ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయించుకోవడం, రసీదులు ఇవ్వడం జరుగుతుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ మొత్తం ఉంటుంది.

ఇసుక కోసం ఎవరైనా రావొచ్చు. బల్క్ వినియోగదారులు, రియల్ ఎస్టేట్ వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. ఒక మనిషికి ఒక ఆధార్ నెంబర్ కి రోజుకి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇస్తాం. ఆ రోజుకి వాళ్లకి మళ్లీ ఇవ్వం. ఒకవేళ వాళ్లే ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినా.. డెలివరీ అడ్రస్ ద్వారా ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలిసిపోతుంది. రెగులర్ కస్టమర్లు, ఇసుక కోసం నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయో వారికి ప్రయారిటీ ఇస్తాం” అని కలెక్టర్ సృజన తెలిపారు.

Also Read : టీటీడీ చైర్మన్‌ పదవిని అశోక్‌ గజపతిరాజు వద్దనుకోవడానికి కారణం అదేనా?