ED Fake Officers Arrest : నెల్లూరులో ఈడీ నకిలీ అధికారుల ముఠా అరెస్ట్‌

నెల్లూరులో ఈడీ అధికారులమంటూ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. కాకర్లవారి వీధిలోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఎనిమిది మంది సభ్యుల ముఠా...తాము తిరుపతి, బెంగళూరు నుంచి తనిఖీలకు వచ్చామంటూ తనిఖీలు చేసింది. జ్యూయల్లరీ షాపు షట్టర్లు మూసేసి తనిఖీలు చేశాక బంగారాన్ని కారులో తీసుకెళ్తున్న సమయంలో యజమానికి అనుమానం వచ్చింది.

ED Fake Officers Arrest : నెల్లూరులో ఈడీ నకిలీ అధికారుల ముఠా అరెస్ట్‌

ED Fake Officers Arrest

Updated On : August 26, 2022 / 8:42 PM IST

ED Fake Officers Arrest : నెల్లూరులో ఈడీ అధికారులమంటూ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. కాకర్లవారి వీధిలోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఎనిమిది మంది సభ్యుల ముఠా…తాము తిరుపతి, బెంగళూరు నుంచి తనిఖీలకు వచ్చామంటూ తనిఖీలు చేసింది. జ్యూయల్లరీ షాపు షట్టర్లు మూసేసి తనిఖీలు చేశాక బంగారాన్ని కారులో తీసుకెళ్తున్న సమయంలో యజమానికి అనుమానం వచ్చింది.

దీంతో అధికారులమంటూ వచ్చినవారిని గట్టిగా నిలదీశారు షాపు యజమాని సునీల్‌. మరోవైపు నెల్లూరు బులియన్‌ అసోషియేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వారొచ్చి నిలదీసేసరికి నకిలీ అధికారుల ముఠా తడబడింది.

Fake Army Major: ఆర్మీలో డ్రైవర్ జాబ్ కోసం రూ.3లక్షలు.. ఫేక్ ఆఫీసర్ వేషాలు

ఈడీ అధికారులమంటూ షాపులోకి వెళ్లి…కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే బంగారం పట్టుకెళ్లేందుకు వచ్చిన నకిలీ అధికారుల మఠాను అడ్డుకుని జ్యూయల్లరీ యజమాని సునీల్, బులియన్‌ అసోషియేషన్ ప్రతినిధులు దేహశుద్ధి చేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. నకిలీ అధికారుల ముఠాను అరెస్ట్‌ చేశారు.