Vallabhaneni Vamsi : సీఎంతో వల్లభనేని వంశీ భేటీ.. గడపగడపకు కార్యక్రమం తప్పనిసరని తేల్చి చెప్పిన జగన్

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదని సీఎం జగన్ తో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది.

Vallabhaneni Vamsi : సీఎంతో వల్లభనేని వంశీ భేటీ.. గడపగడపకు కార్యక్రమం తప్పనిసరని తేల్చి చెప్పిన జగన్

Updated On : October 10, 2022 / 7:55 PM IST

Vallabhaneni Vamsi : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇవాళ సీఎం జగన్ తో వంశీ భేటీ అయ్యారు. అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదని సీఎం జగన్ తో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం చెప్పడంతో వారం రోజుల్లో తిరిగి కార్యక్రమం ప్రారంభిస్తానని వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు వంశీ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌ చర్చించినట్లు సమాచారం. గన్నవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించకపోవడంపై ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రశ్నించారట. ఈ సమీక్షకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ హాజరుకాలేదు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు కార్యక్రమంపై జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులు, వారసులు, బంధువులతో కాకుండా ఎమ్మెల్యేలు స్వయంగా గడప గపడకు కార్యక్రమంలో పాల్గొనాలని అధినేత సూచించారు.