పారికర్ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు,కేసీఆర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2019 / 03:21 PM IST
పారికర్ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు,కేసీఆర్

Updated On : March 17, 2019 / 3:21 PM IST

గోవా సీఎం మనోహర్ పారికర్ మృతిపట్ల  తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు,కేసీఆర్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.పారికర్ కుటుంబ సభ్యులకు ఇద్దరు సీఎంలు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కొంతకాలంగా క్లోమ గ్రంథి వ్యాథితో భాధపడుతున్న పారికర్ ఆరోగ్యం ఆదివారం(మార్చి-17,2019) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తన రాజకీయ జీవితంలో ఎటువంటి ఆరోపణలను పారికర్ ఎదుర్కోలేదు.నాలుగుసార్లు గోవా సీఎంగా పారికర్ పనిచేశారు.