Andhra Pradesh Mega DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీపై నారా లోకేశ్ ప్రకటన
అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు.

Nara Lokesh
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ ఇస్తామని తెలిపారు. తాజాగా ఓ సమావేశంలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో నం.117ను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా పలు విధానాలు తెస్తామని చెప్పారు.
టీచర్ల బదిలీల చట్టంతో పాటు వారికి ప్రమోషన్లు, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై పలు విషయాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఏపీలో రాజకీయాలకు అతీతంగా విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఇప్పటికే తాము విద్యార్థులకు ఇచ్చే కిట్లపై నేతల ఫొటోలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. స్కూళ్లలో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.
Also Read: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. ఆదర్శ పాఠశాలలతో పాటు ఇతర ఉన్నత పాఠశాలలు ఏయే విద్యార్థులకు ఇంటి నుంచి చాలా దూరం ఉంటున్నాయో వారికి రవాణా భత్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ అధికారులు అన్నారు. కాగా, సర్కారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేశ్ చెప్పారు.
భారత్‌లోనే ఏపీ విద్యా వ్యవస్థను అగ్రస్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని, ఇందుకు తగ్గ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జీవో 117 వల్ల కలిగిన ప్రతికూల ఫలితాల గురించి గతంలో చాలా మంది తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.
ఆ జీవో పేరుతో గత వైసీపీ సర్కారు చేసిన నిర్వాకం వల్ల అప్పట్లో సర్కారు స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారని తెలిపారు. ఆ విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చేరారని అన్నారు.