Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎలక్షన్ హామీ అమలు.. ఏప్రిల్ నుంచి..
నిరుడు ప్రసార, పంపిణీకి 2,114.01 కోట్ల రూపాయలను సర్దుబాటు చేశాక సర్కారు డిస్కౌంట్‌గా భరించాల్సిన మొత్తం 12,632.40 కోట్ల రూపాయలుగా కమిషన్ అంచనా వేసింది.

pawan kalyan and chandrababu naidu
ఏప్రీ ప్రజలకు గుడ్‌న్యూస్. ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు కూటమి సర్కారు సిద్ధమవుతోంది. విద్యుత్ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్‌ను ప్రకటించింది. అంతేకాదు, అదనపు వెసులుబాట్లు సైతం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
డిస్కంల ఖర్చులతో పాటు ఆదాయాల మధ్య వ్యత్యాసం 12,632.40 కోట్ల రూపాయలను సబ్సిడీగా సర్కారే భరించనుంది. 2025-26 ఆర్థిక ఏడాదికి కొత్త విద్యుత్ టారిఫ్‌పై ఏపీఈఆర్‌సీ ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఠాకూర్ రాంసింగ్ వివరాలు తెలిపారు. గృహ వినియోగదారుల టారిఫ్‌లో ఎటువంటి మార్పులనూ ప్రతిపాదించలేదని అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఈ కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది. 2025-26 ఆర్థిక ఏడాదిలో విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ ఖర్చులు మొత్తం 57,544.17 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరానికి 58,868.52 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఏఆర్‌ఆర్ రిపోర్టులో డిస్కంలు చెప్పాయన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన పథకం.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల విలువైన..
పరిశీలన అనంతరం 1,324.35 కోట్ల రూపాయలకు కమిషన్ కోత విధించింది. విద్యుత్ అమ్మకాల వల్ల డిస్కంలకు 44,323.30 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేశారు. డిస్కంల అవసరాలతో పాటు, విద్యుత్ అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసం 12,632.40 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
ఆదాయ లోటును 14,683.26 కోట్ల రూపాయలుగా డిస్కంలు అంచనా వేశాయి. అయితే, 2,050.86 కోట్ల రూపాయలను కమిషన్ తగ్గించింది. వచ్చే ఆర్థిక ఏడాది పథకాల కింద ఇచ్చే డిస్కౌంట్లు 1,525.53 కోట్ల రూపాయలతో కలిపి సర్కారు చెల్లించాల్సిన డిస్కౌంట్ మొత్తాన్ని 14,746.41 రూపాయలుగా కమిషన్ లెక్కలు వేసుకుంది.
నిరుడు ప్రసార, పంపిణీకి 2,114.01 కోట్ల రూపాయలను సర్దుబాటు చేశాక సర్కారు డిస్కౌంట్‌గా భరించాల్సిన మొత్తం 12,632.40 కోట్ల రూపాయలుగా కమిషన్ అంచనా వేసింది. దీన్ని వ్యవసాయ, ఉద్యాన, ధోబీఘాట్లతో పాటు ఆక్వాకల్చర్, ఎస్సీ, ఎస్టీలు, గోల్డ్ కవరింగ్ పరిశ్రమలకు, చేనేత కార్మికులకు, పేద రజకులు, నాయీబ్రాహ్మణులు, స్వర్ణకారులకు ఫ్రీ విద్యుత్ పథకం కింద అందించే విద్యుత్‌కు డిస్కౌంట్‌గా సర్కారు ఇస్తుంది.
గృహ వినియోగదారులు అదనపు లోడ్‌ను 50 శాతం ఛార్జీలను చెల్లించడంతో క్రమబద్ధీకరించుకునేందుకు స్పెషల్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వచ్చే నెల నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది.