Gorantla Butchaiah : టీడీపీకి షాక్.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా?

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది

Gorantla Butchaiah : టీడీపీకి షాక్.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా?

New Project

Updated On : August 19, 2021 / 12:36 PM IST

Gorantla Butchaiah Chowdary : టీడీపీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రురల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా గోరంట్లకు ఆదిరెడ్డి అప్పారావు కుటుంబంతో విభేదాలున్నాయి. ఈ విషయంపై అధిష్టానం వద్ద గోరంట్ల అసంతృత్పి వ్యక్తం చేసినట్లు సమాచారం.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న గోరంట్ల అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్ని అంశాల్లో చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. వయసు మీద పడినప్పడికి పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో చురుకుగా పాల్గొనేవారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతును బలంగా వినిపించారు. గోరంట్ల రాజీనామా నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో ఆందోళన మొదలైంది. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారని సమాచారం.