Gossip Garage: జగన్ చేసిన ఆ తప్పు చేయకూడదని చంద్రబాబు అనుకుంటున్నారా? 5.Oకు ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారా?
ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్‌లో ఎలక్షన్స్ కోసం పనిచేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు.

Gossip Garage: ఇప్పుడేం ఎన్నికలు లేవు. జనరల్ ఎలక్షన్స్ రావడానికి ఇంకో నాలుగేళ్ల టైమ్ ఉంది. జమిలి వస్తుందనుకున్నా అందుకు కనీసం రెండేళ్లు పట్టొచ్చు. అయినా చంద్రబాబు దూకుడు మీదున్నారు. రాబోయే ఎన్నికల్లో కోసం గ్రౌండ్‌ను ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు. మళ్లీ..మళ్లీ మనమే రావాలంటూ.. ఎమ్మెల్యేలకు పదేపదే హితబోధ చేస్తున్నారు. పైగా ఇంటింటికి టీడీపీ..సుపరిపాలనలో తొలి అడుగు అంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. చంద్రబాబు రూట్ మ్యాప్ క్లియర్ కట్‌గా ఉందా? పవర్‌లో ఉన్నా రిలాక్స్ కావడం లేదా? చంద్రబాబు..5.Oకు ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారా?
రేపే నోటిఫికేషన్ వస్తుంది..మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉంటాయన్నట్లుగా..ఇప్పటినుంచే దూకుడు పెంచారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. టార్గెట్ 2029 బేస్డ్‌గా పక్కా ప్రణాళిక, పకడ్బందీ వ్యూహమే రచిస్తున్నారట. అటు ప్రభుత్వంగా పాలన పరంగా కీలక నిర్ణయాలు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే..కూటమి వన్స్ అగేయిన్ అంటున్నారు చంద్రబాబు. పార్టీలో అయినా..ప్రభుత్వంలో అయినా ఎక్కడా ఏ చిన్న మిస్టేక్ లేకుండా సెట్ చేస్తున్నారు.
గతంలో ఎప్పుడూ చంద్రబాబు పనితీరు ఇలా ఉండేది కాదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు. ఎన్నికల్లో గెలిచామంటే నాలుగేళ్లు పాలన మీదే దృష్టి పెట్టి లాస్ట్ వన్ వయర్‌లో ఎలక్షన్స్ కోసం పని చేసే వారని..కానీ ఇప్పుడు స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకోగానే..ప్రజల తలుపు తట్టడం..ఇంటింటికి టీడీపీ..సుపరిపాలనలో తొలి అడుగు అంటూ..తన మార్క్ రాజకీయమేంటో చూపిస్తున్నారని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చెప్పుకోదగ్గ స్థాయి వ్యతిరేకత ఏం రాలేదు. సాధ్యం కాదు..అమలు చేయలేరన్న అపోహ ఉన్న ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తోంది. అమ్మ ఒడి వేసి అందరి దృష్టిని ఆకర్షించారు చంద్రబాబు. అన్నదాత సుఖీభవ ఇస్తే సీన్ మరోలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తోంది కూటమి సర్కార్. ఇక మహిళలకు ఫ్రీ బస్ ఆగస్ట్ 15 నుంచి ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజల దగ్గరకు పంపడం వెనుక చంద్రబాబు స్కెచ్చే వేరంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.
ప్రతీ ఓటమి నుంచి..సంక్షోభం నుంచి చంద్రబాబు కొత్త పాఠం నేర్చుకుంటారని..ఆ తప్పు మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతారని..అదిప్పుడు ఆయన నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం స్కీమ్‌లు ఇస్తుంది. అంతా బానే చేస్తున్నామ్.. అలా అని ధీమాగా ఉంటే సరిపోదంటున్నారు చంద్రబాబు. చేసిన మంచిని..ఇచ్చిన పథకాలపై ప్రచారం చేసుకోకపోతే గుర్తించే వారే ఉండరని..అందుకే మనం చేసిన మంచిని, చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించాలని దిశానిర్ధేశం చేసి మరీ ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి పంపిస్తున్నారు సీఎం చంద్రబాబు.
Also Read: మళ్లీ పాదయాత్ర అంటున్న జగన్..! పాత ఫార్ములా తిరిగి పగ్గాలు దక్కేలా చేస్తుందా?
డబ్బులిచ్చాం.. మాకే ఓటేస్తారని అనుకున్నారు..!
ఆయనిలా నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ, జగనే ఉదాహరణ అంటున్నారు. బటన్ నొక్కేశామ్..ప్రజలకు డబ్బులిచ్చామ్..ప్రజలు తమకే ఓటేస్తారనుకున్న వైసీపీకి..తీరా రిజల్స్ట్ వచ్చాక దిమ్మతిరిగే షాక్ తగిలింది. అలా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం కూడా క్యాడర్ లీడర్లకు కనెక్షన్ లేకపోవడంతో..ప్రజలతో ఎమ్మెల్యేల బాండింగ్ తగ్గడం ఓ కారణమన్న చర్చ ఉంది. ఇదే తప్పు తను చేయకూడదనుకుంటున్నారట చంద్రబాబు. అందుకే ఇప్పటి నుంచే ఎక్కడా మిస్టేక్స్ జరగకుండా కేర్ తీసుకుంటూ..చేతుల్లో ఉండి చేయగలిగిందంతా చేస్తూనే..ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే సెట్‌రైట్ చేసుకుంటున్నారట.
నెక్స్ట్ 5.Oకు కూడా ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్..!
చంద్రబాబు సీఎంగా ఇది నాలుగో టర్మ్. నెక్స్ట్ 5.Oకు కూడా ఇప్పటినుంచే గ్రౌండ్‌ను ఇంకా పటిష్టం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండేలా ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఇస్తున్నారట. ఉంటే నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజలతో మమేకం కాండి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్ కట్.. ఆల్టర్ నేట్‌గా ఇప్పటి నుంచే మరో అభ్యర్థిని కూడా సిద్ధం చేసి పెట్టుకుంటానని చెప్తున్నారట చంద్రబాబు. మీరు ఓడిపోయి ఇంటికే పరిమితం కావొద్దు..పార్టీకి డ్యామేజ్ చేయొద్దు..అధికారం కోసం కాదు..రాష్ట్ర కోసం..ప్రజల కోసమే నా తపన అని పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారట.
ఎమ్మెల్యేల విషయంలోనే కాదు ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ నేత పనితీరు ఎలా ఉందని తెలుసుకుంటూ..ఓవరాక్షన్ చేస్తూ ప్రజల దృష్టిలో బ్యాడ్ అవుతూ..పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న లీడర్లకు అయితే..ఎప్పటికప్పుడు వార్నింగ్స్ వెళ్తూనే ఉన్నాయట.
కొత్త చంద్రబాబును పరిచయం చేస్తున్నారు..!
ఈ ఏడాదిలో చంద్రబాబు పనితీరు..నిర్ణయాలలో దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ డెసిషన్ అయినా ఇమీడియేట్‌గా తీసుకోవడం..ఏ చిన్న ఇష్యూపై అయినా వెంటనే రియాక్ట్ అవడం..అపోజిషన్ ప్రతి చర్యను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం వంటి చర్యలు..కొత్త చంద్రబాబును పరిచయం చేస్తున్నాయంటున్నారు. గతంలో అయితే ఇవేమి పట్టించుకోకుండా..ప్రభుత్వం, పాలన మీదే దృష్టి పెట్టేవారని..ఇప్పుడు సార్ మారిపోయారంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
నెక్స్ట్ టర్మ్ కోసమే కాదు..ఫ్యూచర్ బేస్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయంటున్నారు. సేమ్‌టైమ్ జమిలి ఎన్నికలు వస్తాయన్న కోణంలో కూడా చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తుండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా 4.Oలో బాబు దూకుడు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉందంటున్నారు. ఆయన ముందస్తు వ్యూహం, పకడ్బందీ రూట్‌మ్యాప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.