Gossip Garage: మళ్లీ పాదయాత్ర అంటున్న జగన్..! పాత ఫార్ములా తిరిగి పగ్గాలు దక్కేలా చేస్తుందా?
ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ జగన్ 2019 ఎన్నికలకు ముందు..

వస్తా.. మళ్లీ ప్రజల్లోకి వస్తా. పాదయాత్రతో అందరినీ కలుస్తా. అందులో వైసీపీ యూత్ నాయకులను ప్రత్యేకంగా కలుస్తానంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇంకో రెండేళ్ల తర్వాత చేసే పాదయాత్రపై జగన్ ఇప్పుడెందుకు ప్రకటన చేసినట్లు అని ఇంటా, బయట చర్చ జరుగుతోంది. మళ్లీ వైసీపీనే పవర్‌లోకి వస్తుందని.. ఓడిపోయిన మూడు నెలల తర్వాత నుంచే లీడర్లకు ధైర్యం నూరిపోస్తున్న అధినేత..వైసీపీ యూత్ లీడర్ల మీటింగ్‌లో..పాదయాత్రపై లీకులు ఎందుకు ఇచ్చినట్లు అన్నది డిస్కషన్ పాయింట్‌గా మారింది.
అయితే..మీరు రావాలి..జనాల్లో ఉండాలి..లేకపోతే కష్టమంటూ క్యాడర్ చెప్తుండటం.. నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు కూడా లేకపోవడం..వంటివి జగన్ దృష్టికి వచ్చాయట. అంతేకాదు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న నేతలు కూడా దూకుడుగా పని చేయడం లేదని క్యాడర్, లీడర్లకు అండగా నిలవడం లేదని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ నిలబడటం కష్టమంటూ అధినేతకు తమ ఒపీనియన్‌ను తెలియజేశారట.
దాంతో తానే రంగంలోకి దిగుతానని చెప్పి జోష్ నిప్పేందుకే..జగన్ పాదయాత్ర ప్రకటన చేశారన్న టాక్ వినిపిస్తోంది. లేకపోతే కనీసం ఏడాదిన్నర రెండేళ్ల తర్వాత చేసే పాదయాత్రపై ఇప్పుడే ఎందుకు ప్రకటన చేస్తారన్నది కీలక పాయింట్‌గా మారింది. లీడర్లు, క్యాడర్ చేజారిపోకుండా ఉండటం కోసమే పాదయాత్రపై ప్రకటన చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే పాదయాత్ర ఫైనల్ ఆప్షన్‌గా పెట్టుకున్నారట జగన్. ఈ విషయం ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. ముందు జిల్లాల టూర్‌లు పెట్టుకుని తర్వాత పాదయాత్రకు వస్తానంటూ చెప్పారు జగన్. అంటే రాబోయే మూడేళ్లలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో గమనించి..అప్పటి పరిస్థితులను బట్టి పాదయాత్రపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైతే క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు, భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకే జగన్ ఆ ప్రకటన చేశారని అనుకోవచ్చన్న టాక్ వినిపిస్తోంది.
ఈ పాదయాత్ర వరకు బానే ఉన్న..ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ముందుండి నడిపించే నాయకుడు లేక ఇబ్బంది పడుతున్నారట కార్యకర్తలు. అప్పటివరకు తామంతా గ్రౌండ్‌లో నిలబడి పోరాడాలంటే..లేకపోతే జగన్ పాదయాత్ర సక్సెస్ కావాలంటే వెన్నంటి నడిచే నాయకులు ఉండాలని..అందుకోసం ముందుగా అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను వేసి..వాళ్లు యాక్టీవ్‌గా పనిచేసేలా చూడాలని కోరుతోందట క్యాడర్.
Also Read: రాక్షసులపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ వదలను- సీఎం చంద్రబాబు
ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందనేది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికలే ఎజెండాగా ఆయన చేసిన పాదయాత్రకు అప్పట్లో ప్రజల మద్దతు బానే లభించింది. ఇప్పుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉండొచ్చు. కానీ 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇంకా వేరు.
2014లో జగన్ ఓడిపోయారనే సింపతీ 2019 ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చింది. పైగా పోరాడి నిలబడ్డారని జనం అట్రాక్ట్ అయ్యారు. పవర్‌లోకి వస్తే నవరత్నాలు ఇస్తామని చెప్పి..రాజన్న రాజ్యం తీసుకొస్తామన్న నమ్మకం కలిగించడంలో సక్సెస్ అయ్యారు. పైగా ఆ నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సెపరేట్‌గా పోటీ చేశాయి. ఓట్లు చీలిపోయి జగన్‌కు కలిసి వచ్చింది. 2024లో కూడా జగన్ ఆ మూడు పార్టీలు కలవకూడదని కోరుకున్నారు. కానీ ఏదైతే జరగొద్దని జగన్ అనుకున్నారో అదే జరిగింది.
కూటమిగా ఏర్పడి పోటీ చేసి పవర్‌లోకి వచ్చాయి ఆ మూడు పార్టీలు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆ ముగ్గురు కలిసే పోటీ చేస్తామంటున్నారు. ఆ మూడు పార్టీల మాటలు, చేతలు కూడా అదే డైరెక్షన్‌లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో..2018లో జగన్ చేసిన పాదయాత్రతో పోలిస్తే..రాబోయే రోజుల్లో చేస్తానంటున్న పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే డిస్కషన్ పాయింట్. జగన్ పాదయాత్ర చేస్తే చంద్రబాబు సర్కార్‌పై దుమ్మెత్తిపోయడం తప్ప కొత్తగా చెప్పేదేం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పాలనను చూశారని..జగన్ కొత్తగా చెప్పేదేమి లేదని..ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి కూడా లేదంటున్నారు కూటమి లీడర్లు.
నిజానికి వైసీపీ రాజకీయ ప్రస్థానంలో జగన్ పాదయాత్ర ఒక మైలురాయి. మరి అలాంటి పాదయాత్ర మరోసారి చేస్తానని జగన్ చెప్తున్నారు. ఈసారి ఆయన పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చగా ఉంది. జగన్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన సీఎం కాలేదు. ఆయన పాలన గురించి ఎవరికీ తెలియదు. ఈసారి ఆయన పాలన మీద ఒక అభిప్రాయం అయితే ఉంది. అయితే జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్, ఆయన ఏ వర్గాలను కలుసుకుంటారో క్లారిటీ వస్తే తప్ప జగన్ పాదయాత్ర సక్సెస్‌పై ఇప్పుడే ఓ క్లారిటీకి రాలేని పరిస్థితి.
గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి కాస్త స్ట్రాంగ్ బేస్ ఉందని అంటున్నారు. ఆ ఏరియాల్లో పాదయాత్ర డిజైన్ చేసి నిత్యం వార్తలో నిలవాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో పాదయాత్రలు ఎపుడూ సక్సెస్ అవుతూనే వచ్చాయి. పాదయాత్ర చేసిన వారికి అధికారం దక్కింది. వైఎస్సార్, తర్వాత చంద్రబాబు, జగన్, లోకేశ్ ఇలా అందరూ పాదయాత్ర చేసి పదవులు అందుకున్న వారే. కానీ రెండోసారి జగన్ చేసే పాదయాత్ర ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.