Gossip Garage : మాజీమంత్రి విడదల రజిని మెడకు మరో ఉచ్చు..! ఇలాంటి కేసు వస్తుందని అస్సలు ఊహించలేదట..!

ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి మల్లుల రాజేశ్‌ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు.

Gossip Garage : మాజీమంత్రి విడదల రజిని మెడకు మరో ఉచ్చు..! ఇలాంటి కేసు వస్తుందని అస్సలు ఊహించలేదట..!

Updated On : February 6, 2025 / 11:10 PM IST

Gossip Garage : ఆ మాజీ మంత్రిని వివాదాలు విడిచి పెట్టడం లేదు. ఒక ఇష్యూ అయిపోగానే మరో కాంట్రవర్సీలో కార్నర్ అయిపోతున్నారు. ఇప్పుడు మరో కేసు మేడమ్‌ గారికి ఇబ్బందికరంగా మారుతోంది. విడదల రజినికి న్యాయపరంగా చిక్కులు తప్పవా? టీడీపీ కార్యకర్తలను వేధించింది నిజమేనా? ఇంతకు విడుదల రజిని మీద అలిగేషన్స్‌ ఏంటి..? హైకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి.? ఆమెకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లింది ఎవరు.?

పవర్‌లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి..అడ్డగోలుగా వ్యవహరిస్తే..పవర్‌ పోయాక పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏపీలో చాలామంది వైసీపీ నేతలు ఇప్పుడు ఈ పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. అందులో మాజీమంత్రి విడదల రజిని ఒకరు.

అధికారంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నేతలకు టార్గెట్‌ అయిన ఆమె..ఇప్పుడు అపోజిషన్‌లోకి వచ్చాక కేసుల పాలవుతున్నారు. అలా ఆమెను ఒక్కో ఉచ్చు చుట్టుముడుతోంది. కర్షపన్స్ అలిగేషన్స్ అలా ఉండగానే..ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ కేసు ఆమె మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.

Also Read : ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు.. హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్‌ స్థానం..

కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం..
వైసీపీ హయాంలో చివరి రెండేళ్లు వైద్యారోగ్యశాఖ మంత్రిగా హవా చూపించిన విడదల రజిని.. పార్టీ ఓడినప్పటి నుంచి అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆమె మంత్రిగా పనిచేసిన కాలంలో చేసిన అరాచకాలపై ప్రత్యర్థులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే మరో కేసు ఆమెకు ఇబ్బందికరంగా మారేలా ఉంది.

వైసీపీ హయాంలో తనను చిత్రహింసలకు గురి చేశారని ఓ టీడీపీ నేత కోర్టుకు వెళ్ళడంతో మాజీ మంత్రి విడదల రజినితో పాటు ఆమె ఇద్దరు పీఏలు, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో విడదల రజిని మరోసారి చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. టీడీపీ నేత పిల్లి కోటి తన మీద అప్పట్లో జరిగిన చిత్ర హింస మీద హైకోర్టును ఆశ్రయించడంతో.. కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తానేమీ తప్పు చేయకపోయినా..అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు టార్చర్ పెట్టారని పిల్లి కోటి ఆరోపించారు.

టీడీపీ కోసం పని చేస్తే చంపేస్తామని బెదిరింపులు..!
2019లో చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌లో తనను కొట్టారని.. చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలను లైవ్‌లో చూస్తూ రజిని పైశాచిక ఆనందం పొందారని ఆరోపించాడు. టీడీపీ కోసం పని చేస్తే చంపేస్తామని బెదిరించారని కూడా చెప్తున్నాడు కోటి. ఆయన పిటిషన్‌ను విచారించిన కోర్టు..మాజీ మంత్రితో సహా పలువురిపై చర్యలకు ఆదేశించింది. కోర్టు ఆర్డర్స్‌ను ఇంప్లిమెంట్ చేయాలని పిల్లి కోటి ఎస్పీని కూడా కలిశాడు.

విడదల రజిని మీద ఇలాంటి కేసు వస్తుందని ఆమె అనుచరులు కూడా ఊహించలేదని అంటున్నారు. ఒక సాధారణ టీడీపీ నాయకుడు కోర్టుకు వెళ్ళి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేయించేలా ఆదేశాలు తేవడంతో ఆమె వర్గీయులలో కలవరం మొదలైందట. ఇప్పటికే విడదల రజినిపై పలు ఆరోపణలు ఉన్నాయి.

Also Read : ఖాతాల్లోకి రూ.15వేలు.. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్..!

చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి రజిని రెండు కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. ఈ వసూళ్లే కాదు..చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి 16 లక్షల రూపాయల కమీషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీస్‌ కేసు నుంచి తప్పించుకున్నారు రజిని.

ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి మల్లుల రాజేశ్‌ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు. ఇలా ఆమెకు వరుస కేసులు..అలిగేషన్స్ తలనొప్పిగా మారాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో విడదలపై కేసు నమోదు విషయంలో పోలీసుల ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.